This page has not been fully proofread.

దేవీ అశ్వధాటి
 
3
 
శ్లో॥ బాలామృతాంశు నిభ ఫాలా మనా గరుణ చేలా నితంబ ఫలకే
కోలాహల క్షపిత కాలామరాకుశల కీలాల శోషణ రవిః ।
స్థూలాకుచే జలద నీలాకచే కలిత లీలా కదంబ విపినే
శూలాయుధ ప్రణతిశీలా దధాతు హృది శైలాధిరాజ తనయా ॥ 4
ప్రతిపదార్థం
 
12
 
బాలామృతాంశు = అమృత కిరణాలుగల బాల చంద్రుడితో, నిభ= సమానమైన,
ఫాలా= నుదురు గలది, నితంబఫలకే= పిరుదుల మీద, మనాక్ = (కొంచెం) లేత, అరుణ
• చాలా ఎరుపు రంగు చీర గలది, కోలాహల = ఆపదల కలకల ధ్వనులతో, క్షపిత కాల =
కాలం గడిపిన, అమర = దేవతల, అకుశల = కష్టాలు అనే, కీలాల = నీళ్లను, శోషణ =
ఇనికింప జేయటంలో, రవిః = సూర్యుడి వంటిది, కుచే-స్థూలా = స్తనభారం గలదీ, కచే-
జలదనీలా = కురులలో మేఘాల నీలిమ గలదీ, కదంబ విపినే కడిమి తోపులో, కలిత =
మనోహరమైన, లీలా = విలాసం గలదీ, శూలాయుధ = శూలం ఆయుధంగా గల శివుడికి,
ప్రణతి శీలా = నమస్కరించే స్వభావం గలది అయిన, శైలాధిరాజ తనయా = పర్వత రాజ
పుత్రిక అయిన పార్వతీదేవి, హృది = (నా) హృదయంలో, దధాతు = అధివసించును గాక!
 
భావం
 
జగదంబ పార్వతీదేవి కదంబ వనంలో చెలులతో కలిసి విలాసంగా విహరిస్తుంది.
ఆమె ముఖశోభ లేత చంద్రుడిలాగా ప్రశాంతంగా ఉంటుంది. ఆమె లేత అరుణవర్ణంగల
చీరను ధరిస్తుంది. దేవతల కష్టాల కడలిని సూర్యమండలమై ఇనికింప జేస్తుంది. నల్లని కేశ
సంపదతో పీనోన్నతమైన స్తన మండలంతో ఆమె శోభిస్తుంది. ఆమెకు భర్త అయిన పరమేశ్వరుడు
నిరంతర దుష్ట శిక్షణ తత్పరుడు. ఆయనకు నిత్యం ప్రణమిల్లుతుంది పార్వతి. ఆమె సదాచార
సంపన్న. ఆ పార్వతీ దేవి స్థిరంగా నా హృదయంలో నివసించును గాక!
 
విశేష పద వ్యాఖ్య
 
బాలామృతాంశు నిభ ఫాలా
 
పార్వతి చంద్రవదన. బాల చంద్రుడిలాగా ముద్దులొలికే ఫాలభాగం ఆమెది. చంద్ర
స్వరూపిణి, చంద్ర కళాత్మిక, అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. ఆమె ఫాల ప్రదేశం
ప్రకాశిస్తూ భర్తను అలరిస్తుంది. ఆమె సుధా రసస్యందని. తన అమృత కిరణాలతో భక్తులను
సుధా మధుర హృదయులను చేస్తుంది.
 
మనా గరుణ చేల
 
కొంచెం ఎరుపు మించిన పసుపు రంగు కలిగిన చీర. పార్వతీ దేవి అరుణారుణ
కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటిగా ప్రసిద్ధ. అది ఆమెకు అత్యంత ప్రీతి. అది ఆమె స్థిరమైన
 
కరుణకు సంకేతం.