This page has not been fully proofread.

డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు
 
అంటూ శ్రీ త్యాగరాజస్వామి శ్రీరాగంలో గానం చేసి కీర్తించారు. కనుక లక్ష్యసిద్ధికి ఏకాగ్రత చిత్త
సంయమనం అవసరం. అవి ఉన్న వారిని కాళికా దేవి అనుగ్రహిస్తుంది.
 
విశేషాలు
 
11
 
ఇందులోని దేవీ సౌకుమార్యం, చెలులపట్ల ఆమెకు గల అనురాగం, ప్రియకపాళీ
విహారం కబరీ విలాసం శ్రవణా భరణ లలాట తిలకాల శోభ పదకమలధూళి అన్నిటినీ కలిపి
ఏక రూపంగా భావిస్తే మోక్ష సిద్ధికి ఆమెను అధిష్టాన దేవత అనవచ్చు. ప్రియక పాళీ వ్యాళీ
అసిత చూళీ చరణ ధూళి అళిక శోభి తిలకం (కస్తూరి), అశీ నాళీకం అన్నీ కాళికా దేహచ్ఛాయా
సవర్ణాలే. ఈ నల్లనమ్మ పాదసేవ ఆ సల్ల త్రాచులాంటి సంసార బంధాన్ని సర్వనాశనం చేస్తుంది.
కనుకనే ఆమెను భవభయ శమని గా కాళికా స్తోత్రం పేర్కొంది.