This page has not been fully proofread.

దేవీ అశ్వధాట
 
అయిన మహాకాళి యొక్క స్వరూపం కనుక మహాకాళి, చండ ముండులను సంహరించటానికి
వచ్చిన చండికకు కోపంవచ్చి ముఖం నల్లబడింది. ఖడ్గాన్ని చేతబట్టి పులితోలు ధరించిన దేవి
ఆ ముఖంలో నుండి వచ్చి ప్రత్యక్షమైంది. ఆమె పేరే కాళి. రాక్షస సేనలనూ శుంభ నిశుంభులనూ
ఆమె సంహరించింది. కాళీ స్తుతి వలన కలిగే సకల సత్ఫలితాలను గూర్చి కాళికా స్తోత్రం
 
వివరించింది.
 
శ్లో॥
 
10
 
జ్ఞాతా వక్తా కవీశో భవతి ధనపతి ర్దానశీలో దయాత్మా
నిష్పాపీ నిష్కలంకీ కులపతిః కుశల సృత్య వాగ్ధార్మికశ్చ ।
నిత్యానందో దయాఢ్యః పశుగణ విముఖః సత్పథాచార శీలః
సంసారాబ్ధిం సుఖేన ప్రతరతి గిరిజా పాదయుగ్మావలంబాత్ ॥
 
- సర్వ సిద్ధులూ సకల సంపదలూ పొంద గోరిన భక్తుడికి కాళికారాధనం సుప్రసిద్ధమైన మార్గం.
సాకరోతు
 
తుమ్మెద పద్మంలోని మకరందాన్ని ఆస్వాదిస్తూ పరవశించి కాలాన్ని పరిసరాన్నీ కూడా
మరచి పోతుంది. అలాగే భక్తుడు కూడా త్రికరణ శుద్ధిగా దేవీ పదపద్మ సేవలో పరవశించాలి.
ఆ చితైకాగ్రతే భక్తుడు శివా స్వరూపుడవటానికి మూలం. తుమ్మెద యొక్క అంకిత భావానికీ
ఆస్వాదన కళానైపుణికీ పులకించిన పుష్పం, తుమ్మెదకు తనలోని మకరంద మాధుర్యాన్ని
అందిస్తుంది. అలాగే ఉపాసనా కళా పరంగా ఆర్తి ఆసక్తి త్రికరణ శుద్ధి ఉంటే భక్తుడికి దేవి
ఫలసిద్ధిని ప్రసాదిస్తుంది.
 
మనః
 
మనసు చంచలమైనది. అది క్షణ కాలం కూడా కుదురుగా వుండలేదు. చంచలం
హి మనః కృష్ణ అన్నాడు అర్జునుడు. కనుక దేవీ ఉపాసకు డైనవాడు తన మనసును స్వాధీనం
చేసుకోవాలి. అంతర్ముఖుడు కావాలి. అందుకోసం మనసును కామ క్రోధ లోభ మోహ మద
మాత్సర్యాలనే అరిషడ్వర్గం నుండి దూరం చేయాలి. హృదయంలో అంగుష్ఠ పరిమిత స్థానంలో
ఉన్న ఆ పరమాత్మను ప్రసన్న చిత్తంతో దర్శించి ధన్యుడు కావాలి.
 
అంగుష్ఠ మాత్రః పురుషోన్తరాత్మా
 
సదా జనానాం హృదయే సన్నివిష్టః
హృదా మనీషా మనసాభి క్లప్తో
యఏతద్విదు రమృతా స్తే భవంతి
 
- శ్వేతాశ్వతరోపనిషత్
 
మనస్సుతో తెలియ దగినవాడు భగవంతుడు. అలా తెలిసి కొన్నవారే అమృతాత్ములు. అలాంటి
 
వారిని గూర్చి,
 
మానస వనచర వర సంచారము నిలిపి
 
మూర్తి బాగుగ పొడగనే వారెందరో మహాను భావులు ॥
చందురు వర్ణుని అంద చందమును హృదయార
 
విందమున జూచి బ్రహ్మానంద మనుభవించు వారెందరో మహానుభావులు -