We're performing server updates until 1 November. Learn more.

This page has not been fully proofread.

డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు
 
దేవతలూ వశిష్ఠాది మహర్షులూ నారదాది ఋషులూ ఆ పరాశక్తి వైభవాన్ని అనంత శక్తినీ
సామర్థ్యాన్నీ జయజయ ధ్వానాలతో నుతించారు. దేవికి సాష్టాంగ పడి నమస్కరించారు. అప్పుడు
ఆమె పాదరజస్సు వారి శిరస్సులకు సోకి శోభించారు. అలాగే ఎప్పుడూ తనకు నమస్కరించే
భక్తులను ఆమె సర్వధర్మ మర్మజ్ఞులను చేస్తుంది.
యా 2ళీ భృతి శ్రవసి తాళీదళం వహతి
 
ఆళీ = శుధ్ధాంత రంగం, విశదాశయం, పార్వతీదేవి విశుద్ధమైన మానసం గలది. శుద్ధ
సత్యమే ఆ దేవీ మనో రూపం. జగన్మంగళమే ఆ దేవి విశదాశయం. ఆ ఆశయ సిద్ధికి భర్త
ఫలాభి వృద్ధి కామన ముఖ్యం. అందుకు తగిన విధంగా మంగళ ప్రదమైన ఆభరణాలు
ధరిస్తుంది. ఇది ఆర్ష సంప్రదాయం.
 
తాళీ దళం = చెవికమ్మ, చెవ్వాకు దేవిని తాళీదళాబద్ధ తాటంక భూషా విశేషగా శ్యామలా
దండకం చిత్రించింది. పూర్వకాలంలో పుణ్యస్త్రీలు తాటి ఆకులతో చేసిన కర్ణాభరణాలను
ధరించేవారు. అవే తాళీ దళాలు. పార్వతీదేవి తాటంక యుగళీభూత తపనోడుప మండల.
ఆమె చెవి కమ్మలే సూర్య చంద్ర మండలాలుగా ప్రకాశిస్తున్నాయి. ఆ దేవీ తాటంకాలకు గల
మృత్యుంజయ శక్తిని గూర్చి ఆదిశంకరులు ప్రస్తుతించారు.
 
9
 
సుధా మప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యు హరిణీం
విపద్యర్తే విశ్వే విధి శతమఖాద్యా దివిషదః ।
కరాళం యత్ క్వేళం కబలితవతః కాల కలనా
 
న శంభో స్తన్మూలం తవ జనన్ని తాటంక మహిమా ॥ - సౌందర్యలహరి
అమృతాన్ని ఆస్వాదించిన బ్రహ్మేంద్రాది దేవతలైనా సరే ప్రళయ కాలంలో విపత్తికి లోనుగాక
తప్పదు. కనుకనే ఓ జననీ! సృష్టి స్థితి కర్తృత్వాలు నీ అధీనాలు. శివుడికి మృత్యుంజయత్వం
సిద్ధించింది నీ చెవి కమ్మల మహిమ వల్లనే కదా! ఇక శివుడు నిన్నేమని ఆశీర్వదిస్తాడు?
 
భర్తృ ఫలాభివృద్ధిని కోరే స్త్రీలు ధరించ వలసిన మంగళాభరణాల జాబితాను శ్రీనాథు
 
డిలా వివరించాడు.
 
మ॥ పసుపుం గుంకుమ కజ్జలంబు నును గూర్పాసంబు తాంబూలమున్
గుసుమంబుల్ కబరీ భరంబు చెవి యాకుల్ మంగళాలంకృతుల్
 
అభీక శోభి తిలకా
 
కాశీఖండం
 
నుదుటి తిలకం సుమంగళీ చిహ్నం. ఆపై ముఖాలంకరణం. అభిమంత్రించిన
కాళికాదేవి నుదుటి తిలకం లోకవశీకరణ శక్తి నిస్తుంది.
 
కాళీ
 
కాళ వర్ణత్వాత్ కాళీ = నీల వర్ణం కలది. కాళ వర్ణత్వాత్ కాళికా = నల్లనిది. కాళికా
శబ్దం పార్వతీ దేవికీ నలుపు రంగుకు పేరు. కనుక పార్వతి నల్లనిదని స్పష్టమైతుంది. కాలుడి
శక్తి కాళి, కాలుడంటే శివుడు, యముడు. కాల శక్తి స్వరూపిణి కనుక కాళి. ఆమె మృత్యువును
కూడ నాశనం చేస్తుంది. కనుకనే ఆమె మహాకాళి, ఉజ్జయినీ పీఠాధీశుడైన మహాకాలుడి పట్టమహిషి