This page has not been fully proofread.

డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు
 
- సౌందర్య లహరి
 
శ్లో॥ యదీయం సౌరభ్యం సహజ ముపలబ్ధం సుమనసో
వసం త్యస్మి న్మన్యే వలమథన వాటీ విటపినాం ॥
పార్వతీదేవి కేశపాశం నునుపు మెరుగు చిక్కన గల్గిన సల్ల కలువల వనంలాగా ప్రకాశిస్తుంది.
ఎంతో సహజ సువాసనా భరితంగానూ ఉంటుంది. ఆ పరిమళాల కోసం నందనవనంలోని
దేవతాకుసుమాలు వచ్చి అక్కడే నివసిస్తాయి. అటువంటి ఆమె కొప్పు భక్తుల ఆజ్ఞానాన్ని
పారద్రోలుతుంది..
 
రూపాధికా
 
7
 
ఆమె శివ రూపంగల పరాశక్తి మహారూప సర్వజగన్మోహిని, కోమలాంగి, బాల్య పొగండ
కైశోర యౌవనాది భేదాలు లేని నిత్యయౌవన లోకాలను మోహింప చేసే సుందరమైన రూపం
ఆమెది. అందు చేతనే ఆమె రూపాధిక.
 
శిఖరి భూపాల వంశమణి దీపాయితా
 
హిమవంతుడు అత్యున్నత శిఖరాలుగల కుల పర్వతాలలో ఒకడు. అవి ఏడు.
మహేంద్రో మలయస్సహ్య, శుక్తిమాన్ గంధ మాదనః ।
 
వింధ్యశ్చ పారియాత్రశ్చ, సప్లైతే కుల పర్వతాః ॥
 
వాటిలో ఉత్తమ వంశ సంజాతుడూ గుణోన్నతుడూ హిమవంతుడు. వజ్ర వైడూర్య గోమేధిక
పుష్యరాగ మరకత మాణిక్య నీల ప్రవాళ మౌక్తికాలు అనే నవరత్నాలకూ ఖని. ఇటువంటి
హిమవంతుడి వంశాన్ని మణి దీపంలా ప్రకాశింప చేసింది పార్వతీదేవి.
భగవతీ
 
మాహాత్మ్యస్య సమగ్రస్య, ధైర్యస్య యశసః శ్రియః ।
జ్ఞాన వైరాగ్య యోశ్చైవ, షణ్ణం భగ ఇతీరితః ॥
 
సంపూర్ణమైన మాహాత్మ్యం ధైర్యం కీర్తి సంపద జ్ఞానం వైరాగ్యం అనే ఆరింటికీ కలిపి భగ
అని పేరు. ఆ లక్షణాలు కలది భగవతి. ఆమె వాటిని తన భక్తులకు ప్రసాదిస్తుంది.
విశేషాలు
 
భగవతీ చరణ ధూళీ మాహాత్మ్యం, మంత్ర మహిమ, నీపావాసం, సుఖాభిలాష, సౌందర్య
భావన, నిత్య యౌవనం, ఆర్త త్రాణ పరాయణత్వం భగవతీ లక్షణాలు. పితృగృహంలో మణి
దీపంలా వెలిగిన పార్వతీదేవి మాతృమూర్తిగా భక్తులను జ్ఞాన కిరణాలతో చైతన్య మూర్తులను
చేసి శుభాన్ని కలిగిస్తుంది. ఆమెను ఆరాధిస్తే ఎటువంటి వారైనా ముక్తిని పొందుతారు.
 
ఈ శ్లోకంలోని పార్వతీ దేవి మోక్షాన్నీ జ్ఞానాన్నీ పుణ్యాన్నీ సద్వర్తనాన్నీ కలిగించగల
రూపసంపద గుణసంపద వస్తుసంపద గల్గిన ఉన్నత వంశ సంజాత.