This page has not been fully proofread.

6
 
గుణ ప్రతిరూప మైన ఆమె చరణ ధూళి భక్తులను సృష్టి స్థితిలయకారులు నివసించే త్రిదివానికి
చేరుస్తుంది. మహాత్ముల పాదధూళి పవిత్రమైనది కదా!
 
త్వత్పాద పంకజ రజః ప్రణిపాత పూర్వైః
పుణ్యై రనల్ప మతిభిః కృతిభిః కవీంద్రః ।
 
- దేవీ చర్చాస్తుతి
 
ఆమెకు నమస్కరించి, ఆమె పాదపంకజ రజస్సును శిరస్సున ధరిస్తే కవీశ్వరులు అనల్ప
కల్పనా ప్రతిభు లైతారు.
 
పాపాపహ స్వ మను ..... నిపుణా
 
। పాప= పాపం, అజ్ఞానం, అవిద్య; మను = మననాత్రాయతే ఇతి మన్హః. మననం
చేయటం వల్ల రక్షించేది లేదా విశ్వాసం వల్ల రక్షించేది మంత్రం.
 
తాపం = ఆధ్యాత్మిక, ఆధి భౌతిక ఆధి దైవిక మనేవి తాప త్రయాలు. ఆధ్యాత్మికం = తనకూ
తనవారికీ కలిగిన వ్యాధుల వలన మనిషికి కలిగే బాధ. ఆధి భౌతికం= సర్ప వృశ్చికాదుల వల్ల
కలిగే బాధ. అధి దైవికం = దైవికంగా సంభవించే అగ్నిప్రమాదాలూ భూకంపాలు మొదలైన
వాటి వలన కలిగే బాధ. ఆ దేవి మంత్రోపాసనతోనూ పూజా పురస్కారాలతోనూ తనను భజించే
భక్తుల పాపాలను పోగొడుతుంది.
 
- దేవీ భాగవతం
 
మేరు పర్వత మాత్రోపి, రాశిః పాపస్య కర్మణః।
కాత్యాయనీం సమాసాద్య, నశ్యతి క్షణ మాత్రతః॥
ఛిత్వా భిత్వా చ భూతాని, హత్వా సర్వ మిదం జగత్ ।
ప్రణమ్య శిరసా దేవీం, న స పాపై ర్విలిప్యతే॥
 
- బ్రహ్మాండ పురాణం
భక్తుల అవిద్యను అజ్ఞానాన్నీ అంతం చేస్తుంది పరమ శక్తిమంత మైన ఈ భగవతీ మంత్రజపం.
సర్వ మంత్రాలకూ ఆ దేవి కాణాచి కావటం చేతనే ఆమెను మంత్రాణాం మాతృకాదేవీ అని
శ్రీదేవ్యుపనిషత్తు కీర్తిస్తున్నది. ఆమె మంత్రసార, మంత్ర స్వరూపిణి, మంత్రవీర్య ప్రకాశ. తన
మంత్ర జపంలో నిమగ్నులైన భక్తుల్ని ఆమే స్వయంగా రక్షించి శుభాన్ని కలిగిస్తుంది. మోక్షాన్ని
ప్రసాదిస్తుంది.
 
నీపాలయా
 
నీపః నయతి ప్రాణినస్సుఖం నీపః ప్రాణులకు సుఖాన్ని కలిగించేది నీపం.
అమ్మవారికి అటువంటి నీప వనం నివాసం. అందుచేత ఆమె సుఖలాలస.
సురభి ధూపాలకా
 
సురభి = ణానికి ఇష్టమైన గంధం. కమ్మని తావి. కళాప్రియులైన అతివలు అభ్యంగన
స్నాన మాచరించి పరిమళ ద్రవ్యాలతో కురులకు పొగ వేసుకొంటారు. సహజ సురభిళమైంది
పార్వతీ కేశ పాశం. దాన్ని మరీ పరిమళ భరితం చేసుకోవాలని సురభి ధూపం వేసుకొంటుంది
ఆమె. ఇది స్త్రీలందరకూ ఉపాదేయం. సహజ సువాసనాభరితమైన శైలజా శిరోజాల మహిమను
గూర్చి శంకరులు వివరించారు.