This page has not been fully proofread.

డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు
 
శ్లో॥ ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివ సోపాన ధూళి చరణా
పాపాపహ స్వమను జాపానులీన జన తాపాపనోద నిపుణా।
నీపాలయా సురభి ధూపాలకా దురితకూపా దుదంచయతు మాం
రూపాధికా శిఖరి భూపాల వంశమణి దీపాయితా భగవతీ॥ 2
ప్రతిపదార్థం
 
5
 
ద్వైపాయన ప్రభృతి ద్వీపమే ఉత్పత్తి స్థానంగా గల వేదవ్యాసుడు మొదలైన
శాపాయుధ = శాపమే ఆయుధంగా గల తపస్సంపన్నులైన మహర్షులకు, త్రిదివ = స్వర్గానికి,
సోపాన = నిచ్చెనలైన, ధూళి చరణా = పాదరేణువులు గలదీ, పాప + అపహ = పాపాలను
పోగొట్టే, స్వ మను = తన యొక్క మంత్రాన్ని, జప = జపించటంలో, అనులీన జన =
తన్మయులైన భక్తుల యొక్క, తాప = తాప త్రయాలను, అపనోద = తొలగించటంలో,
నిపుణా = నేర్పరితనం కలదీ, నీప+ఆలయా= కడిమి వనంలో నివసించేది, సురభి = ముర
అనే సుగంధ ద్రవ్యాన్ని, ధూప = సువాసన కోసం పొగ వేసిన, అలకా = నెఱి వెండ్రుకలు
కలదీ, రూపాధికా = మిక్కిలి అందమైనది, శిఖరి భూపాల వంశ = పర్వత రాజయిన
హిమవంతుడి వంశానికి, మణిదీపాయితా = రత్నదీపం వంటిదీ అయిన, భగవతీ =
సమసైశ్వర్యవంతురాలయిన పార్వతీ దేవి, మాం= నన్ను, దురిత కూపాత్ = పాపకూపం
నుండి, ఉదంచయతు= ఉద్ధరించునుగాక!
 
భావ
 
=
 
పార్వతీ దేవి పాదరేణువులు పరమ పవిత్రమైనవి. శాపాయుధులైన వ్యాసాది మహర్షులకు
సైతం అవి ముక్తి సోపానాలు. మహత్తరమైనది ఆమె మంత్ర జపం. పరవశంతో తన మంత్రాన్ని
జపించే భక్తుల పాపాలను ఆమె పటాపంచలు చేస్తుంది. వారికి శుభ పరంపరలను ప్రసాదిస్తుంది.
కడిమి వనం ఆమెకు నిత్యనివాస ప్రదేశం. అనునిత్యం తన శిరోజాలను ధూప ధూమాలతో
పరిమళింపచేస్తుంది. ఆమె సుగుణశీల, మహోన్నతుడైన తన తండ్రి హిమవంతుడి ఇంటికి
మణిదీపంలా వెలుగుతూ పెరిగింది. ఆ పార్వతీ దేవి నన్ను ఈ సంసార కూపం నుండి
వెలువరించుగాక!
 
విశేష పద వ్యాఖ్య
త్రిదివ సోపాన ధూళి చరణా
 
i
 
త్రిదివం = హరి హర బ్రహ్మాఖ్యా ప్రయో దీవ్యంతి క్రీడంత్య త్రేతి త్రిదివః. విష్ణు శివ
బ్రహ్మలు క్రీడించే ప్రదేశం త్రిదివం.
 
శ్రీదేవీ చరణ రేణువులు స్వర్గానికి సోపానాలు. వాటిని శిరసా వహిస్తే పరబ్రహ్మ తత్త్వం
పట్ల ఆత్మను ఆమె సంయోగ పరుస్తుంది. అంటే స్వర్గం కరతలామలక మైతుంది. అందువల్లనే
ఆమెను దేవీం భుక్తి ముక్తి ప్రదాయినీం అని దేవ్యుపనిషత్తు ప్రస్తుతిస్తున్నది. సత్త్వ రజస్తమో