This page has not been fully proofread.

4
 
విశేషాలు
 
దేవీఅశ్వధాటి
 
కడిమిపూలూ మణి గణ ఖచితమైన మకుటమూ మణి కాంతులూ వాటి చేత ప్రకాశించే
ఆమె పానాలూ పాటీర గంధంతో కూడిన కుచశాటి ముఖవీటి వంటివి అన్నీ అరుణ వర్ణ
విశేషాలే. అందుచేతనే ఆమె సర్వారుణగా సుప్రసిద్ధ. అరుణ వర్ణం అభివృద్ధికీ అనురాగానికీ
 
కరుణకూ సంకేతం.
 
కడిమిపూలూ కాంతాజనం పాటీరగంధం ముఖవీటి కుచశాటి మొదలైనవన్నీ ఆమె
సుఖాభిలాషకూ శృంగార భావనకూ రసనిష్ఠకూ ప్రతీకలు. అవి సర్వప్రాణులకు సంతోష కారకమైన
శృంగార ప్రశస్తికి సూచికలు.
 
ఉదార శబ్దంవల్ల ఉత్తమ కావ్యలక్షణమైన ఉదారత స్ఫురిస్తుంది. పదాలు
నర్తించినట్లుండటం ఉదారత. దీని వల్ల పద్యగతి నృత్య లీలా స్ఫోరకంగా ఉంటుంది. ఇటువంటి
పద ప్రయోగశక్తి ఆమె ముఖతః మాత్రమే సంక్రమిస్తుంది. తన కోరిక కనుగుణంగానే కాళిదాసు
అశ్వధాటీ వృత్తంలో దాన్ని సాధించినట్లు స్పష్టమైతున్నది.