This page has not been fully proofread.

3
 
డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు
 
స్తన వల్కలానికి గుస్తరించి ఆమె హృదయం శృంగార రస కోశంగా పరిణమిస్తుంది. అలాటి
గుబాళింపులు తన కవితా రూపంలో వెలువడాలని కవి భావన.
 
కవిత్వ పరిపాటీ
 
పార్వతీదేవి ఛందస్సార, శాస్త్రసార, కవితా వ్యుత్పత్తికి కాణాచి, కావ్యకళ. కావ్యోత్పాదక
ప్రతిభ ఆమెలో కళా స్వరూపంగా ఉంది. అందువల్ల ఆమె కావ్యరచనా సమర్ధురాలు. ఆమె
ప్రతిభాస్వరూపిణి. కోరిన వారికి కవితాధారను ప్రసాదిస్తుంది.
మాసమేకం ప్రతిదినం, త్రివారం యః పఠేన్నరః ॥
భారతీ తస్య జిహ్వాగ్రే, రంగే నృత్యతి నిత్యశః ॥
రోజుకు మూడు పూటల వంతున ఒక్క నెల రోజుల పాటు లలితా సహస్రనామ పారాయణం
చేసినట్లయితే భారతీదేవి వారి జిహ్వాగ్రాల మీద నర్తిస్తుంది. కనుకనే కాళిదాసకవి ఆ తల్లిని
కమ్మని కవితా క్రమాన్ని ఇమ్మని అర్థించాడు, సాధించాడు గూడా.
అగాధిప సుతా
 
లలితాసహస్రనామస్తోత్రం
 
పర్వతాలకు అధిపతి హిమగిరి. అది సకల సౌభాగ్య నిలయం. వజ్ర వైడూర్య మరకత
మాణిక్యాది నవరత్న నిధి. సంజీవిని వంటి ఔషధాలకూ సిందూర గైరికాది ధాతువులకూ భోగ
పదార్థ సంపదలకూ ఆటపట్టు. ప్రేమైక జీవులకూ ఆనందోపాసకులకూ విద్యాధర కిన్నర కింపురుష
గరుడ గంధర్వ మిథునాలకూ విహార భూమి. పలు రకాల పశువులకూ పక్షులకు క్రీడావని.
రూప విద్యా వినయ సౌజన్యాలకూ ఉత్సాహం పౌరుషం మొదలైన ఉత్తమ గుణాలకూ కుల
శీల సౌందర్య సద్భావాలకూ నిలయం. అంతటి మహనీయుడైన హిమవంతుడికి ప్రియ పుత్రిక
పార్వతీదేవి. ఆమె తండ్రి గుణగణాలను పుణికి పుచ్చు కొన్నది.
ఘోటీ ఖురాదధిక ధాటీ
 
ధాటి విషయంలో ఆడజాతి గుర్రాలు మగజాతి కన్న కడు మిన్న. ఒడుపైన వాటి
గిట్టల ధ్వని వేగం లయ బద్ధంగా శ్రుతి పేయంగా ఉంటుంది. అంతకంటే కమనీయమైన
ఆశు కవితా ధారను ప్రసాదించమని కవి కాళిదాస కామన.
ముఖవీటీ రసేన
 
రసః= రస్యతే ఆస్వాద్యత ఇతిరసః రస ఆస్వాదనే. ఆస్వాదింపబడేది.
 
పార్వతీ దేవి నిత్య తాంబూల పూరిత ముఖ, కర్పూర వీటికామోద సమాకర్ష దిగంత.
ఆమె నోటిలోని తాంబూలపు పరిమళాలు దశదిశలా వ్యాపిస్తాయి. సర్వ దేవతలనూ ఆ పరిమళాలు
ఆకర్షిస్తాయి. ఆ తాంబూలం విలాసానికీ రసికతకూ ఆనందాతిశయానికీ సంకేతం. ఆమె
సేవించిన తాంబూల రసంతోనే అనురాగంతో తనకు రసవత్తరమైన కవితాధారను ప్రసాదించమని
కవి కోరిక. వీటికామోదం లాగానే తన కవిత సర్వ జనామోదం కావాలని మహాకవి కాళిదాసు
 
వాంఛ.