This page has not been fully proofread.

దేవీ అశ్వధాటి
 
శ్లో॥ చేటీ భవ న్నిఖిల భేటీ కదంబ వన వాటీషు నాకి పటలీ
కోటీ మణీ కిరణ కోటీ కరంబిత పదా !
 
పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీ మగాధిప సుతా
ఘోటీఖురా దధికధాటీ ముదార ముఖవీటీరసేన తనుతామ్ ॥ 1
 
ప్రతిపదార్థం
 
కదంబ =
 
కడిమి చెట్ల యొక్క, వనవాటీషు ఉద్యానవనాలలో, బేటీభవత్ =
చెలికత్తెలుగా చేయబడిన, నిఖిలభేటీ = సమస్త దేవతా వనితలు గలదీ, నాకిపటలీ =
స్వర్గవాసులైన దేవతాసమూహాల, కోటీర = కిరీటాలకు చెందిన, చారుతర = మిక్కిలి మనోజ్ఞమైన,
కోటీ = శిఖరాగ్రభాగాలలో ఉన్న, మణీకిరణ = రత్నకాంతుల యొక్క, కోటీ = సమూహాలు,
కరంబిత = వ్యాపించిన, పదా = పాదాలు గలదీ, పాటీర - చందనపు, గంధి గంధంగల,
కుచశాటీ = స్తనవల్కలం గలదీ అయిన, అగాధిపసుతా పార్వతీదేవి, ఉదార = అధికమైన
మహిమగల, ముఖ = నోటిలోని, వీటీరసేన = తాంబూల రసంతో, ఘోటీఖురాత్ = ఆడ
గుర్రాల గిట్టల కంటె, అధికధాటీం = ఎక్కువ వడి గల, కవిత్వ పరిపాటీం = కవితా రీతిని,
తనుతాం = వృద్ధి చేయును గాక !
 
=
 
=