This page has not been fully proofread.

డా॥ మేళ్లచెర్వు భానుప్రసాదరావు
 
-ఎం.ఏ., ఎం.ఫిల్., పిహెచ్.డి.
 
రీడర్, తెలుగు విభాగం
 
ఎస్.ఎస్. & ఎన్. కళాశాల
 
నరసరావుపేట - 522601
 
అభివందనాలు
 
మహాకవి కాళిదాసు తాను రచించిన దేవీస్తుతి శ్లోక త్రయోదశిలో దేవీ స్వరూప
స్వభావ సౌందర్య వర్ణనంతో పాటు కవితా కన్యాస్వరూప స్వభావాలను కూడా
ఆవిష్కరించాడు. వాటిని భక్తులకూ కవితాసక్తులకు వివరించాలనే భావంతో ఈ వ్యాఖ్యా
గ్రంథాన్ని వెలువరిస్తున్నాను. ఈ స్తుతి రకరకాల పేర్లతో ఎనిమిది నుండి పదమూడు
అశ్వధాటీ వృత్తాలతో పాఠభేదాలతో ప్రచారంలో ఉంది. వాటిలో రసోచితమైన పాఠాలనే
స్వీకరించాను. కొన్ని తావుల్లో పాఠభేదాలను కూడా వ్యాఖ్యానించాను. అది దేవీ తత్త్వాన్నీ
కవితా విశేషాల్నీ పరిపూర్ణంగా నిరూపించాలన్న ధ్యేయంతో చేసిన పని.
 
ఈ వ్యాఖ్యలో దేవీ సప్తశతి, లలితాసహస్ర నామావళి, సౌందర్యలహరి ఉపనిషత్తులు
గురుబాల ప్రబోధిక వంటివి ఎంతగానో ఉపకరించాయి. ఆయా గ్రంథకర్తలకు నా
నమోవాకాలు. మా మేనమామ, దేవీతత్త్వజ్ఞులు శ్రీ దోనెపూడి వెంకయ్యగారు ఈ గ్రంథ
రచనకు ప్రథమతః నన్ను ప్రోత్సహించి THE WORSHIP OF BEAUTY అనే శీర్షికతో
తమ అభిప్రాయాన్ని అందించి ఆశీర్వదించారు. ప్రియమిత్రులు, నిత్యసాహిత్యవ్రతులు
డా॥చేరెడ్డి మస్తాన్రెడ్డి, డా॥ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి ఆద్యంతం చేదోడువాదోడుగా చెంతనిలిచి
మదాలస పేరుతో తమ అభిప్రాయాన్ని వెలువరించారు. డా॥ వేదాన్తం సత్య శ్రీనివాస
అయ్యంగార్, శ్రీ కంచర్ల కామేశ్వరరావు తగుసలహాలతో సహకరించారు. ముద్రణకు తిరుమల
తిరుపతి దేవస్థానంవారు ఆర్థిక సాహాయ్యం చేశారు. మురళీ ఆఫ్ సెట్ ప్రింటర్స్ వారు ఈ
గ్రంథాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దారు.
 
- ఇలా ఈ దేవీ అశ్వధాటీ కృతినిర్మితిలో సహకరించిన అందరికీ నా
కృతజ్ఞతాభివందనాలు.. Poort
 
నరసరావుపేట.
ఈశ్వర, భోగి
 
13-1-1998
 
భాను.