2023-05-14 13:43:40 by ambuda-bot

This page has not been fully proofread.

58
 
ఆస్తికత్వము.
 
"తతస్తు సౌగతం రూపం శిశాయ శ్రీపతిః స్వయమ్ ।
అలీన సున్దరతరం త్రైలోక్యస్యాపి మోహనమ్ ॥
శ్రీః పరివాజికా జాతా నితరాం సుభగాకృతిః ।
యా మాలోక్య జగత్సర్వం చితవ్యస్త మివార్పితమ్
గరుత్మా నపి తచ్ఛిష్యో జాతో లోకోత్త రాకృతిః ।
గురుశుశూషణవరో న్యస్త హస్తాగ్రపుస్తకః॥
అపృచ్ఛ త్పరమం ధర్మం సంసారవిని మోచకమ్ ।"
 
ఆశిష్యుని నిమిత్తముగా జేసికొని ఆగురువు చేసిన ఉపదేశముల
లోని ప్రధానాంశములు ఇవి —
 
బ్రహ్మ విష్ణు మహేశ్వరు లనబడు వారు మనవంటి వా రే.
వారికి చతుర్ముఖ— చతుర్భుజ పంచముఖాది స్వరూపవర్ణనము కల్ప
నామాత్రము.
 
భీతులకు అభయగానము, వ్యాధిగ్రస్తులకు ఔషధదానము,
విద్యార్థులకు విద్యాదానము, శుధాతుగులకు అన్నదానము, ఈ
నాలుగు దానములే చేయవలసినవి. మణి మంత - ఓషధుల బలము
సంపాదించి తన్మూలమున ధనార్జనము చేయవలయును. అట్లు ఆర్జిం
చిన ధనముచే ద్వాదశాయతనపూజనే చేయవలెను.
వ్యర్థము. ద్వాదశాయతనము లనగా పంచకర్మేంద్రియములు, పంచ
జ్ఞానేంద్రియములు, మనో బుద్ధులు. ఇవియే ద్వాదశాయతనములు.
వీని పూజకై అనగా ఇంద్రియతృప్తికై పాటుపడవలయును.
 
ఇతర పూజలు
 
స్వర్గ — నరకములు ఇక్కడనే యున్నవి. మరెక్కడనో లేవు.
సుఖపడుటే స్వర్గము. దుఃఖపడుటే సరకము.
 
సుఖపడుచున్నప్పుడు శరీరమును విడచుటే ముక్తి, అహింసయే
 
పరమధర్మము.
 
"ప్రామాణికీ శ్రుతి రియం ప్రోచ్యతే వేదవాధిభిః।
న హింప్యా త్సర్వభూశాని నాన్యాహింసాప్రవర్తికా
అగ్నీసోమీయ మితి యా శ్రామికా సాంసరా మిహ ।
న సా ప్రమాణం జ్ఞాతౄణాం పశ్వాలంభనకారికా"