2023-05-14 13:43:39 by ambuda-bot

This page has not been fully proofread.

ఆస్తికత్వము.
 
సిద్ధములై న పదార్థములుమాత్రమే యున్నవి. అవత్యక్షపదార్థములు
అప్రత్యక్షము గనుకనే లేవు. అందుచేతనే అదృష్ట మనునది లేదు.
3 లోకములో అనుభవింపబడు సుఖదుఃఖములు స్వభావసిద్ధ
ములే అయి యున్నందున వానికి అపత్యడములు అదృష్ట రూప
ములు) అయిన ధర్మాధర్మములు కారణమని కల్పింప వీలులేదు.
4 దేహమే ఆత్మ, దేహముకంటె వేరుగా ఆత్మ లేదు. ఆకు, వక్క,
సున్నము సీనియొక్క మేళనములో ఎరుపు పుట్టినట్లు పృథివ్యాది
భూతవికారములైన దేహములయందు చైతన్యము పుట్టుచున్నది.
కనుక చైతన్యము నేహధర్మమే. 5 ఇహలోక ముకంటె వేరుగా స్వర్గము
నరకము అని చెప్పబడు పరలోకము లేదు. ఉన్నట్లు చెప్పువారు వంచ
కులు. మృష్టాన్న సక్చందన వనితాద్యు పభోగమూలక సుఖమునకే
స్వర్గసుఖమని పేరు. శత్రు శస్త్ర వ్యాధ్యాది ఉపద్రవమూలక
దుఃఖమున కే నరకదుఃఖమని పేరు.
 
1
 
50
 
6. వేప ముకుంది ప్రాణవాయువు పోవుటే మరణము. అట్టి
మరణమునకే మోక్షమని పేరు. ఇట్టిదే మోక్షము గనుక దాన్ని కై
వతోపవాస తపశ్చర్యాది క్లేశము వ్యర్థము.
 
7 దుర్బలులు స్త్రీలకు కాపాడుకొనదలచి తమబుద్ధిబలమున
పాతివ్రత్య మను సంకేతమును కల్పించినారు.
 
8 అన్న దాన, స్వర్ణదాన, భూదానాదులు కుక్షింభరులైన
దరిద్రులచే కల్పింపబడినవి.
 
9 సత్ప్ర కూప-ఆరామ- దేవాలయాడి నిర్మాణకర్మలను బాట
సారులు మాత్రమే ప్రశంసింతురు.
10 వేడ-అగ్నిహోత్ర భర్మధారణ సంన్యాసాదులు బుద్ధి
పౌరుషహీనులకు జీవనోపాయమాములే.
 
11 కృషి-గోరక్షణ— వాణిజ్య దండనీతి- ప్రభృతి దృష్ట కార్య
 
ములచేతనే భోగములను సదా అనుభవించుచుండవలెను.
 
12 యజ్ఞములో
 
హింసింపబడిన పశువునకు స్వర్గప్రాప్తి
 
నిజమైన యెడల యజ్ఞము జేయు యజమానుడు తన తండ్రినే హింసించి
 
స్వర్గప్రాప్తి కలిగింపకపోవుటేమి ?