2023-05-14 13:43:39 by ambuda-bot

This page has not been fully proofread.

ఆస్తికత్వము.
 
మాయా మోహో ప దేశము
 
విష్ణుపురాణము—అం.
 
38 అ. 17లో నిట్లు చెప్పబడియున్నది.
ఒకప్పుడు నర్మదానదీ తీర మందు దైత్యులు కొందరు వేదోక
ప్రకారము ఏకాగ్రతతో తపస్సు చేయుచుండిరి. దేవతలు భయపడి
శ్రీహరిని శరణు పొంది యిట్లనిరి- –
 
'స్వవర్ణధర్మాభిరతా వేదమార్గానుసారిణః
 
1
 
న శక్యా స్తేజరయో హస్తు మస్మాభి స్తపసా వృతాః
 
[7]
 
49
 
దేవా! వేదమార్గానువర్తులై, స్వధర్మాసక్తులై, తపోబలసంప
న్నులై యుండు దైత్యులను హింసింప నశక్య మగుచున్నది. అని.
అది విని శ్రీహరి తనశరీరమునుండి యొక పురుషుని మాయా
మోహు డను వాని నుద్భవింపం జేసి యీతని వలన మీకు కార్యసిద్ధి
యగునని చెప్పి పంపెను. ఆ మాయామోహుడు తన నామము సార్థక
మగునట్లు తపశ్చర్యయందున్న ఆదైత్యులను తన యుక్తులచే
వ్యామోహితులను చేసి వై దికమార్గ భష్టులను చేసెను. బృహస్పతి
సూత్రానగతములైన మాయామోహోపదేశములను వినివిని విశ్వ
సించి ఆదైత్యులు జతపోదీక్షను విడిచివేసిరి.
 

 
.
 
"ఏవం ప్రకారై రృహుఖి ర్యుక్తి దర్శనచర్చితై 8 ।
మాయామోహేన తే దై త్యా వేదమార్గా దపాకృతాః ।
వ్యా— ఏవంప్ర్రకారై ర్వాక్యైః యుక్తి దర్శనం శుష్కతర్క
వాదః తేన చర్చితైః"
 
మాయామోహుడు శుష్క తర్కమును వినియోగించి అవై దిక
మార్గము లనేక ముపదేశించి వేదమార్గవిశ్వాసహీనులనుగా దైత్యు
 
లను చేసివేసెను. అని.
 
చార్వాకమత సిద్ధాంతములు
 
శ్రీమచ్ఛంకరాచార్య విరచిత సర్వసిద్ధాంత సంగ్రహము, శ్రీ
మాధ వాచార్య విరచిత సర్వదర్శన సంగ్రహము, పురాణసంహిత మొద
లగు గ్రంథములయందు ఇట్లున్నది — 1 వృథివి, జలము, అగ్ని,
వాయువు అని నాలుగే భూతములు. ఆకాశము లేదు. 2 వత్యంత