2023-05-14 13:43:38 by ambuda-bot

This page has not been fully proofread.

1.7
 
ఆ స్తికత్వము.
 
ఈతనికి సఖుడు కాగలడు. ఆ దుర్యోధన సఖ్యమునుబట్టి బ్రాహ్మణావ
మానమును ఈతడు చేయగలడు. అప్పుడు వారు వాగ్బలమున నీతని
దగ్ధముచేయగలరు. అని. అదే విధముగా పాపియగు చార్వాకుడు
నిహతుడయ్యెను. అని.
 
ఇది మహాభారతోక్త చార్వాకవృత్తాంతము. ఈతనిచే వ్యాపిం
పజేయబడుటనుబట్టి వచ్చినదే చార్వాకమత మను "పేరు.
 
— చార్వాకమతమునకు బృహస్పతి ప్రవర్తకుడగుట -
శనగరువైన బృహస్పతి తన శిష్యులగు దేవతలకు అసుర
 
గణమువలన కలుగు బాధలను తొలంగించుట కుపొయ మాలోచిం
 
చెను. అసురగణము యజ్ఞాదికర్మలను విధ్యుక్తముగా చేసి తన్మూల
మున సామర్థ్యాత్సాహములను సంపాదించుచు దేవతలను జయించుచు
వచ్చెను. అది చూచి యజ్ఞాది కర్మలయందు ఆ అసురగణమునకు
శ్రద్ధ పుట్టకుండుటకును, పుట్టియున్న శ్రద్ధ పోవుటకును, ఆవిధమున
వారు నిర్వీర్యులగుటకును ఉపదేశము చేయదలచి అట్టి సూత్రములను
అందుచేత చార్వాకుపచారము అసురులయం దే
బృహస్పతిద్వారా సంభవించినది. బృహస్పతిసూత్రములను బట్టి
 
ఆమతము బృహస్పతికి సమ్మతమే అని యనుకొనుట పొరపాటు.
బృహస్పతి శుక్రాచార్యరూపమును ధరించి దేవళతువులగు
అసురులకు అవై దికమార్గము నుపదేశించి యజ్ఞాదికర్మలు హింసా
యుక్త
ములగుటచే చేయరాదని యిట్లు బోధించెను - దేవీ భాగవతము-
స్క4. అ62.
 
"భో దేవరిపన సృత్యం బ్రవీమి భవతాం హితమ్ !
అహింసా పరమో ధర్మో 2 హంతవ్యా శ్చాతతాయినః ।
 
8 1
 
వ్యా బృహస్పతిమత మాహ- భోదేవరిపవ ఇతి । ఆతతా
యినో2పి అహన్త వ్యా ఇతి ఛేదః । న హస్తవ్యా ఇత్యర్థః
ద్విజై ర్భోగరతై ర్వేదే దర్శితం హింసనం హోరోః ।
జిహ్వాస్వాదపరైః కామ మహింసైవ పరామతా ॥
వ్యా-వేదోక్తాపి హింసా న కర్తవ్యేత్యాహ- ద్విజైరితి '