2023-05-14 13:43:38 by ambuda-bot

This page has not been fully proofread.

45
 
ఆస్తీకత్వము,
 
త్ములగు వాండవులకు హానికలిగించు దుష్టసంకల్పముతో నిర్భీకుడై
యుధిష్ఠిరునితో నిట్లనెను
 
ఈవిప్రోత్తము లందరును నిన్ను గూర్చి మాటలాడు భారము
నా పై బెట్టియున్నారు. జ్ఞాతిక్షయము చేసిన నీవు నింద్యుడవు; నీవు
ప్రజాపాలనమునకు తగవు; జ్ఞాతిక్షయము, గురుజనహింస జేసిన నీవు
 
జీవించుటకంటె మరణించుట మేలు. అని.
 
ఆదుష్టు డిట్టి మాటలాడుచుండ విని బాధపడి విపులుసు, యుధి
ష్ఠరుడును తలవంచుకొని మాటాడలేకపోయిరి.
 
అంతట యుధిష్ఠిరు డిట్లు ప్రార్థించెను.--మహనీయులారా ! నమ
స్కారపుర్వకముగా యాచించుకున్న నన్ను మీ రనుగ్రహింపవలెను.
సన్ను పరివేష్టించియుండి చిరకాలడుఃఖతులై నట్టి నాసోదరుల దుఃఖ
పరిహారార్థమే నేనీ రాజ్యము చేయుటతప్ప ఆత్మసుఖార్థము కాదు. అని.
'తలో రాజగా బ్రాహ్మణా స్తే సర్వ ఏవ విశాంపలే ।
ఊచు ర్నైత ద్వచో2 స్మాకం శ్రీరస్తు తవ పార్థివ
"జ్ఞు శ్చైవ మహాత్మాన స్తత స్తం జ్ఞానచువా ।
కాహ్మణ ఎదవిద్వాంస సహా ర్విమలీకృతాః ॥
3-ప్మిణ ఊచు:---
 
ప గుర్యోధనని, చార్వాక' నామ రాదని ।
పరవా జకర వీణ హీఠం తర్య విర్షతి ॥
 
సి బూటు ధర్మాత్మ:- వ్యేతు తే ఫియ మీదృశము 1
ఉపతిష్ఠతు కల్యాణం భవన్తం థాతృభి స్సహ ॥
బొప్మిణా స్సర్వే హుంకారైః క్రోధమూర్ఛితా
నిర్భర్తయన్తి శ్శుచయో నిజమ్ను పాపరాక్షసమ్ II'
 
తర
 
8
 
అది విని ఆవిప్రోత్తము ల "క్క పెట్టున యుధిష్ఠిరునితో మహా
 
రాజ ! ఇది మామాటకాదు. నీకు శుభమగుగాక ? అని పలికి వేద
వేత్తలు, తపస్సంపన్నులు, పరిశుద్ధాంతఃకరణులు అగు ఆవిపులు జ్ఞాన
దృష్టిచే దెలిసికొని యుధిష్ఠిరున కిట్లు చెప్పిరి యుధిష్ఠిరా! ఈతడు
దుర్యోధనసఖుడైన చార్వాకుడను రాక్షసుడు, యతి వేష ధారియై దుర్యో
ధరఖాకారియై యిట్టు నిష్పగించినాడు. ఇవి మామాటలు కావు.