2023-05-14 13:43:37 by ambuda-bot

This page has not been fully proofread.

ఆ స్త్రీ క త్వ ము.
 
i
 
39
 
రమై యున్నదని తెలిసికొనవలయును. కామశాస్త్రమం దేమి చెప్ప
బడినదో చూడుడు
 
'సర్వత్ర హి లోకే కతిచిదేవ శాస్త్రజ్ఞః, సర్వజన విషయగ్య
ప్రయోగః । ప్రయోగస్య చ దూరస్థ మపి శాస్త్రమేవ హేతుః ।
అస్తి వ్యాకరణ మితి అవైయాకరణా అపి యాజ్ఞికా ఊహం
కతుషు ప్ర్రయుంజతే అస్తి జ్యోతిషమితి పుణ్యాహేషు కర్మ
కుర్వతే ! తథా అశ్వారోహా గజారోహాశ్చ అశ్వాక్ గజాంశ్చ
అనధిగతశాస్త్రా అపి వినయస్తే। తథా అస్తిరాజేతి దూరస్థా
అపి జనపదాః న మర్యాదా మతివర్తస్తే తద్వదేతత్ ॥"
 
1
 
హేతువు.
 
అనగా, లోకములో సర్వవిషయములలోను కొద్దిమంది యే
శాస్త్రజ్ఞు లుందురు. వారి నాధారము చేసికొని ఆయా వ్యవహారము
మాత్రము సర్వజనసాధారణమై యుండును. ఆ సర్వసాధారణమైన
వ్యవహారమునకు కు రస్థమైన శాస్త్రమే పరంపరగా
వ్యాకరణశాస్త్ర మున్నదికనుకనే వ్యాకరణాధ్యయనము చేయని
వారుగూడ సుశబ్దములను ప్రయోగింపగలుగుచున్నారు. వారి సుళబ్ద
ప్రయోగమునకు పరంపరగా వ్యాకరణశాస్త్రమే మూలా ధారము.
జ్యోతిశ్శాస్త్ర మున్న దిగనుకనే ఆశా
ఆశాస్త్రము జదువని వారు
గూడ శుభముహూర్తములలో పనులు చేయుచున్నారు. దానికి
జ్యోతిశ్శాస్త్రమే మూలా ధారము.
 
అశ్వశాస్త్ర – గజశాస్త్రములను చదువనివారుకూడ అశ్వము
లను గజములను శిక్షించుటలోను, పోషించుటలోను కుశలత కలిగి
యున్నారు. దానికి పరంపరగా ఆ శాస్త్రములే మూలాధారము.
 
ప్రభువు యొక్క మొగమెరుగని యెక్కడనో ఉన్న ప్రజలు
కూడ హద్దుమీరక భయభక్తులతో ప్రవర్తించుచుండుటకు పరంపరగా
ప్రభువే మూలాధార మైయున్నట్లు లోకానుగతములై యున్న ఆయా
వ్యవహారములకు ఆయా శాస్త్రములే వరంపరగా మూలాధారములై
యున్నవి. అని భావము.
 
దీనినిబట్టి ఇది మంచి, ఇదిచెడ్డ అని యుక్తాయుక్త వివేకముతో
నడచుచున్న లోక వ్యవహారము పండిత పామరసాధారణముగా శాస్త్ర