2023-05-14 13:43:36 by ambuda-bot

This page has not been fully proofread.

ఆ స్తీకత్వము.
 
37
 
అనాటి ధర్మము లీనాడు పనికిరా వను చతుర్థ వాదమునుగూర్చి —
ఆనాటి ధర్మములు ఆనాటి వారి కేగాని, యీనాటివారికి పనికి
రావను మాట అయు క్తము.
 
ధర్మప్రమాణభూతము లై న శ్రుతిస్మృతులు ఆనాటివే యీ
నాడును ఆశ్రుతిస్మృతిప్రోక్తములైన ధర్మములు ఆనాటివే యీనా
డును. అధర్మాధర్మఫలముల ననుభవింపజేయు భగవంతుడు ఆనాటివాడే
ఈనాడును. ఆధర్మాధర్మనిమిత్త మైన సంసారమందు జననమరణ ప్రవాహ
ములో చిక్కుకొని యున్న జీవులు ఆనాటివా రే యీనాడును.
ఇట్లు పరిశీలింపగా శుతిస్మృతులు మారలేదు; ధర్మాధర్మస్వరూప
ములు, వాని ఫలములు మారలేదు; ఫలదాత యగు భగవంతుడు మార
లేదు; జీవులు మార లేదు. ఆధర్మములు ఈనాడేల పనికిరావు ?
 
కూడను.
 
పోయిన దేహముతో జీవుడు పోయె నని, పుట్టిన దేహముతో
కొత్త జీవుడు పుట్టే నని అనుకొనుట అనుభవవిరుద్ధము
పుట్టినది మొదలు జీవులలో సుఖదుఃఖాదిప భేదములు కనబడుచున్నవి.
A →ప్ర్రభేదములకు కారణము కర్మ యనియే చెప్పవలసియున్నది. ఆకర్మ
అప్పటిది కాక జన్మాంతరీయ మనవలసియున్నది. ఆకర్మ జన్మాంతరీయ
మెప్పుడైనదో ఆకర్మ చేసిన జీవుడును వెనుకటివాడే కావలసియున్నది.
కనుకనే 'న జీవో మియతే' అను శ్రుతి మరణ మనునది దేహధర్మమ
కాని, జీవధర్మము కాదని బోధించుచున్నది.
 
'భూతగామ స్స ఏహె2 యం భూత్వా భూత్వా పలియతే'
అనుచు వెనుకటి జీవులే దేహాంతర ధారు లగుచు వచ్చుచున్నా
రని గీతలో భగవంతుడే చెప్పియున్నాడు.
 
మరణించిన జీవులు ఏమేమో చెప్పుచున్నట్లు కొన్ని నిదర్శన
ములుకూడ ఆధునికలోకములో గానవచ్చుచున్నవి.
 
ఆనాటివారు కోరినట్టి సుఖములనే యీనాట వారును కోరుచు
ఆసుఖములకు హేతువులుగా ఆనాటివా రవలంబించిన ఆధర్మములు ఈ
నాటి వారికి పనికిరావనుట అసంగతముకసిక చతుర్థవాదము నిరస్తము.