2023-05-14 13:43:35 by ambuda-bot

This page has not been fully proofread.

31
 
ఆ స్త్రీ కత్వము.
 
చేతను, పరిస్థితులనుబట్టి మారుచుండుట ధర్మమునకు లక్షణము
కాకుండుటచేతను మార్చబడినది అధర్మమే అగును.
 
ఇంకొకటి—దేనిని మార్చవలెనని చెప్పుదురో దానిని ధర్మ మని
భావించినట్లా? అధర్మమని భావించినట్లా ? ఆధర్మమని భావించిన
పడములో 'ధర్మములను మార్చవలెను.' అనుట ఎట్లు సరిపడును?
ధర్మమని భావించునపుడు దానిని మార్చుటలో అధర్మమైపోదా? శ్రేయ
స్సాధనము ధర్మము; ధర్మమును మార్చిన శ్రేయస్సు ప్రాప్తింపక
 
పోవును.
 
లోకుల ప్రవృత్తి నిబట్టి ధర్మము మారవలె ననుటకూడ. మంచిది
కాదు. ధర్మమునుబట్టి.. ప్రవృత్తి యుండవలెను కాని, ప్రవృత్తి నిబట్టి
ధర్మ ముండరాదు. ప్రవృత్తినిబట్టి యుండునది అధర్మమె కాని,
ధర్మము కాదు.
 
ధర్మదూర మైనను లోక ప్రవృత్తిని బలపరచుటయందే తాత్పర్య
మైనయెడల శాస్త్రముల జోలికి పోకుండునే మంచిది. వానికి అపా
ర్ధము లెందుకు చెప్పుదురు ?
 

 
మారు
 
'అన్యే కృతయుగే ధర్మాః అన్యే కలియుగే నౄణామ్ ।'
అను పరాశరస్మృతివచనమునుబట్టి ధర్మస్వరూపము
చున్నట్లు కనబడుటలేదా? అని యందురేమో అచ్చట పరాశరమాధ
వీయ మందేమి చెప్పబడినదో చూడుడు--
'అత అన్యశబ్ది ధర్మస్య న స్వరూపాన్యత్వ మాచ ప్టే, కిన్తు
సకారాన్యత్వమ్ । అన్యథా ధర్మప్రమాణచోదనానా మపి యుగ
భేదేన భేదాపత్తే ః । నహీయం చోదనా కృతే ధ్యేత వ్యా, ఇయన్తు
శ్రేతాయా మిత్యాది వ్యవస్థాపకం కించిదని ప్రకారాన్య త్వేత్వస్తి
దృష్టాన ః ।'
 
అనగా యుగ భేదమునుబట్టి ధర్మస్వరూపమునకు భేదము చెప్పబడ
లేదనియు, అట్లే అయిన యెడల
ధర్మముపట్ల ప్రమాణమైన వేదమునకు
గూడ భిన్నత్వము చెప్పవలసివచ్చుననియు, ఈయుగమందు ఈ వేదము,
ఆయుగమందు ఆ వేదము అని యెచ్చటను చెప్పబడలేదనియు, ధర్మము
నాచరించు పద్ధతిలోని భేదమే ఇచ్చట చెప్పబడినదనియు భావము.