2023-05-14 13:43:33 by ambuda-bot

This page has not been fully proofread.

ఆస్తికత్వము.
 
వేదాంతదర్శనము_'శారీరం వాచికం మానసం చ కర్మ శ్రుతి
స్మృతిసిద్ధం ధర్మాఖ్యం, యద్విషయా జిజ్ఞాసా 'అథా2లో
ధర్మ
జిజ్ఞాసా' ఇతి సూతితా, అధర్మోఒ పి హింసాదిః ప్రతి షేధచోదనా
లక్షణత్వా జ్ఞాస్యః పరిహారాయ ॥
 
19
 
శ్చోదనాలతణయోః అర్థా2 సర్ధయోః ధర్మా
ప్రత్యడే సుఖదుఃఖే శరీరవాఙ్మనోభి రేవోప
భుజ్యమానే విష యేనియసం యోగజ న్యే బ్రహ్మాదిషు స్థావరా
నేషు ప్రసిద్ధే ।
 
తయో
ధర్మయోః ఫలే
 
మనుష్యత్వా దారభ్య బ్రహ్మాస్తేషు దేహవత్సు సుఖతార తమ్య
మనుశ్రూయతే । తతళ్ళ తద్ధేత ధర్మస్య తారతమ్యం గమ్యతే !
ధర్మతారతమ్యా దధి కారితారతమ్యమ్... తథా మనుష్యాదిషు
నారకస్థావరాస్తేషు సుఖలవః చోదనాలక్ష ణధర్మసాధ్య ఏవేతి
గమ్యతే తారతయ్యేన వర్తమానః ।
 
తథా ఊర్ధ్వం గణేషు అథోగతేషు చ దేహవత్సు దుఃఖతార
 
తమ్యుదర్శనాత్ తద్ధేతో
తడసిుష్ఠాంనాం వ తారతమ్యం గమ్యతే''
 
రధర్మగ్య ప్రతి షేధచోదనాలక్షణస్య
 
శరీరముచేతను, వాక్కు చేతను, మనస్సుచేతను చేయబడుచుండు
కర్మకే ధర్మమని, అధర్మమని పేరు. అది వేదశాస్త్రవిహిత మైనప్పుడు
ధర్మ మనబడును. వేదశాస్త్రనిపిద్ధమైనప్పుడు అధర్మ మనబడును.
అనగా 'సత్యం వద' 'ధర్మం చర' ఇత్యాదివిధముగా విధింపబడినది
ధర్మము. 'నానృతం వదేత్' 'న పరదారాణ గచ్ఛేత్' ఇత్యాదివిధముగా
ని షేధింపబడినది అధర్మము.
 
అట్టి ధర్మాధర్మముల యొక్క ఫలములే ప్రత్యక్షము లగుచున్న
సుఖదుఃఖములు. ధర్మాధర్మములు శరీరముచే చేయబడినవై నపుడు
ఆ సుఖదుఃఖములు శరీరముచే (వ్యాధ్యాదిరూపమున) అనుభవింపబడును.
వాక్కుచే చేయబడిన వైనపుడు ఆసుఖదుఃఖములు వాక్కుచే కటు
భాషణాదిరూపమున అనుభవింపబడును. మనస్సుచే చేయబడిన వై
నపుడు సుఖదుఃఖములు (మనోవ్యధాదిరూపమున) అనుభవింపబడును.