2023-05-14 13:43:32 by ambuda-bot

This page has not been fully proofread.

ఆ స్త్రీ క త్వము.
 
నీతిశాస్త్రము— శుక నీతి—"సుఖం చ న వినా ధర్మాత స్మా
ద్ధర్మపరో భవేత్" సుఖము ధర్మమూలకమే కాబట్టి మనుజుడు ధర్మ
పరుడై యుండవలెను. అనుచు ధర్మప్రశంసనే చేయుచున్నది.
 
DE
 
అర్థశాస్త్రము— 'తయీధర్మ శ్చతుర్ణాం వర్ణానా మాశ్రమా
ణాం చ స్వధర్మస్థాపనా దౌపకారికః' అనుచు వేదోక్త ధర్మము వర్ణా
శ్రమములను స్వధర్మమందు నిలుపుచు లోకోపకారక మగుచున్నదని
ధర్మప్రశంసనే చేయుచున్నది.
 
15
 
ఇట్లు విస్తృతమైన వై దిక వాఙ్మయములోని వివిధ గ్రంథములును
ఏకవిధముగా ధర్మమును ప్రచంపించుచున్నవి.
 
ధర్మాధర్మములవలన కలుగు ఫలము లిట్లు చెప్పబడినవి.
"ఏక ఏవ సుహృ ద్ధర్మో నిధనే ప్యనుయాతి యః ॥
శరీ రేణ సమం నాళం సర్వ మన్యద్ధి గచ్ఛతి ॥
న సీద న్నపి ధర్మేణ మనో ధర్మే నివేళయేత్ ।
ఆధార్మికాణాం పాపానా మాశు పశ్య న్విపర్యయమ్ ॥
 
మరణించినపుడు శరీరముతోగాటు సర్వము నశించునడే. వెంట
వచ్చునదిమాత్రము తన ధర్మమొక్కటియే. అట్టి ధర్మము నాచరిం
చుట కష్ట మనిపించినను అధార్మికుల పాపఫలములను ప్రత్యక్షముగా
జూచుచున్న మనుజుడు తన మనస్సు అధర్మమందు ప్రవర్తింపకుండ
 
జేసికొనవలెను.
 
'ధనాని భూమౌ పశవ శ్చ గోష్టే భార్యా గృహద్వారి జనాశ్మశానే!
దేహ శ్చితాయాం పరలోకమార్గే ధర్మానుగో గచ్ఛతి జీవ ఏకః" ॥
జీవుని పరలోక ప్రయాణ కాలములో ధన ధాన్యములు, పశు
వులు అవి యున్నచోటనే యుండిపోవును. భార్య గృహద్వారపర్యం
తము సాగనంపును. స్వజనము శ్మశానపర్యంతము సాగనంపును.
దేహము చితియందుండిపోవును. ఇట్లు అసహాయుడైన జీవునకు తన
ధర్మ మొక్కటియే సహాయముగా పోవును,
 
"ధర్మా ద్రాజ్యం ధనం సౌఖ్య మధర్మా దుఃఖసంభవః ।
తస్మా ధర్మం సుఖార్థాయ కుర్యా శ్పాపం చ వర్జయేత్" I