2023-05-14 13:43:32 by ambuda-bot

This page has not been fully proofread.

ఆ స్త్రీకత్వము.
 
18
 
పురుషా
 
ము లు
 
ధర్మము, అర్థము, కామము, మోక్షము అని పురుషార్థములు
నాలుగు. పురుషార్థము లనగా మనుష్యులచే కోరబడునవి యని
యర్థము. ఇందు అనిత్యమైన విషయసుఖమునకు కామమనియు, నిత్య
మైన నిరతిశయసుఖమునకు మోక్షమనియు పేరు.
 
ఇందు అర్థ-కామములు మనుష్యులు సహజముగా కోరునట్టివే.
విషయసుఖరూపమైన కామమునకు సాధనముగా అర్థము కోరబడు
చున్నదని లోకులకు తెలిసిన విషయమే. సుఖమును కోరుటలో అధిక
సుఖమును, అత్యధిక సుఖమును, సత్యసుఖమును కోరుట సహజము
కనుక అట్టి నిత్యనిరతిశయసుఖమగు మోక్షముకూడ కోరబడునదే.
 
ఇక ధర్మమును కోరవలసిన పనియేమి? అని శంక కలుగును.
కోరబడుచున్న సుఖముగాని, దానికి సాధనముగా కోరబడుచున్న
అర్థముగాని కోరినంతమాత్రమున ప్రతిమనుష్యునకును స్క్రాప్తించుచు
న్నదా? ప్రయత్న మెంతచేసినను సిద్ధించుచున్నదా? అందుచేత అర్థ-
కామప్రాప్తి కి కోరిక, పురుషప్రయత్నము ఇంతమాత్రమే కారణము
కాదు. కారణాంతర మున్నది. దానిలోపముచే నిది సిద్ధింపలేదు. అని
సర్వసాధారణముగా " తోచుచునే యున్నది. ఆ కారణాంతర మే ధర్మము.
కనుక అర్థకామముల సపేక్షించువాడు వానికి సాధనమైన ధర్మమును
అ పేటంపవలసినవాడే.
 
కనుకనే...' ధర్మా దర్థశ్చ కామశ్చ స కిమర్థం న సేవ్యతే'
అని మహాభారతవచన ముద్ధోషించుచున్నది.
 
ఇట్లు సుఖవి శేషరూపమైన కామ మోటములు రెండును
ములుగను, ధర్మార్థములు రెండును వానికి సాధనములుగను నుండుట
చేత మరి యేకోరికలై నను ఈ నాలుగింటిలో నే అంతర్భూతము లగుటను
బట్టి పురుషార్థములు నాలుగని పరిగణింపబడినవి.
 
ఇందు ధర్మాచరణము చిత్త శుద్ధికిని, అర్థార్జనము దేవతారాధన
కును, 'కామమనబడు విషయసుఖ సేవనము జీవనమాత్రమునకు, వీని
యోగించుకోనుచు మోక్షమును పొందుట ఉత్తమమార్గము.