2023-05-14 13:43:31 by ambuda-bot

This page has not been fully proofread.

[2]
 
ఆస్తికత్వము.
 
ఇది 'పురాణవర్మలో'ని సారాంశము. దీనినిబట్టి 'కేవలసంహిత యే
వేదము; బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు వేదము గావు'
అను వారి వాదము పరాస్తము.
 
వేదపామాణ్యమునుగూర్చి అభిప్రాయభేదములు
 
ఆర్ష సంస్క్రదాయాసువర్తులందరును కర్మకాండ- ఉపాసనా కాండ -
జ్ఞాన కాండ -రూపముగా నున్న వేదమంతయు ప్రమాణ మనియు,
వేదార్ధనిర్ణయమునకై ఋషికృతములైన పూర్వమీమాంసా-ఉత్త

మీమాంసాది—దర్శనములు, వేదాంగములు, పురాణములు, ధర్మశాస్త్ర
ములు ఇవన్నియు ప్రమాణము లే అనియు చెప్పుదురు. చెప్పుటమాత్రమే
కాదు. తమ ఆస్తికత్వమును రక్షించుకొనుచు గురుకులవాసము చేసి
వాని నన్నిటిని అధ్యయనాధ్యాపనపద్ధతిలో బెట్టి యథాశక్తిగా ఆచ
రించుచున్నారు.
 
9
 
అన్యులు కొందరు వేదములోని మంతభాగము మాత్రమె
ప్రమాణమునియు, మిగిలిన పైనుదాహరింపబడిన వేవియు ప్రమాణ
ములు కాడనియు, మఁతములకు తాము చెప్పునట్టిదే అర్థమనియు
చెప్పుచున్నారు.
 
నురికొందరు. నేరములోని ఉపనిషత్తులు మాత్రమే ప్రమాణ
సనియు, మిగిలినభాగము సపణము కాగనియు చెప్పుచు, తాము
త్యేకత వహించి మిగిలినవి అని మాణములకు విషయములో పైవా
రిలో నేకీభవించుచున్నారు.
 
మరికొందరు—వేద సొంతమాత్రము ప్రమాణము కాదని ప్రత్యేకత
నహించుచు మిగిలినవి అపమాణమను విషయములో పై వారితోనే సకీ
భవించుచున్నారు. వీరిలో అవాంతర భేదములతో గొన్ని తెగలున్నవి.
 
ఇట్లు తమకు తోచినట్లు తలకొక విధమున చెప్పుచు తమతమ
బుద్ధులనే ప్ర్రమాణముగా బెట్టుకొని పరమప్రమాణమై, బహుళమై
యున్న విద్యాస్థానములనబడు . వైదిక వాఙ్మయమును నిరసించువారు
ఆస్తికత్వమునకు చెందిన వారు కానేరరు.
 
'నాస్తికో' వేదనిందక'' అని కదా మనుస్మృతివచనము.