2023-05-14 13:43:31 by ambuda-bot

This page has not been fully proofread.

8
 
S
 
కత్వము.
 
సంహితలు స్వతఃప్రమాణములనియు, బ్రాహ్మణములు, ఉపనిష
త్తులు కేవలము పరతఃప్రమాణములనియు తమ యభిప్రాయముగా
దెలుపుచున్న దయానంద సరస్వతి యిప్పుడు చూపిన కారణముల
కంటె బలవత్తరమైన యువపత్తులను చూపనిదే యొప్పుకొనుటకు
 
వీలులేదు.
 
రాజా శివప్ర్రసాదు ఒకటి స్వతః ప్రమాణమైనచో రెండును
స్వతఃప్రమాణము లెందుకు కాకూడదో, ఒకటి పరతఃప్రమాణమైన
పుడు రెండును అట్లే యెందుకు కాకూడదో? అని సరిగానే అడుగు
చున్నారు. బ్రాహ్మణములు ఉపనిషత్తులు గల వేదములు మాత్రమే
అజ్ఞాత కాలమునుండి హిందువుల చేత పవిత్రమైన ఉపదేశ గ్రంథము
లుగా భావింపబడుచుండుటచేత నీవిధముగా వేదము కానట్టి గ్రంథ
మును వేదముతో సమాన మని చెప్పుట కెవ్వరును ప్రయత్నింపరు.
 
శతపథ బ్రాహ్మణములోని (బృహదారణ్యకోపనిషత్తులోని)దయా
నంద సరస్వతి యుదాహరించిన వాక్యమునుగూర్చి రాజా శివప
సాదు చెప్పిన యధ్యంతరము సప్రమాణమని యంగీకరింపక తప్పదు.
ఆవాక్యములోని యొక భాగము ప్రమాణమైనపుడు ఇగర భాగ
మును అట్లే యగును. అసంపూర్ణ వాక్యము ఒక వాక్యమా? లేక
వాక్యసమూహమా ? అనునది వివాదాంశమునకు ఎంతమాత్రము
 
సంబంధింపదు.
 
వేదములో నుంఠములుమాత్రమే చేరియున్నవనియు, బ్రాహ్మణ
ములు తరువాత చేర్చబడినవనియు, కాత్యాయన వాక్యము తెలియ
జేయుచున్నదని దయానంద సరస్వతి చెప్పుటకు ఎంతమాత్రము
 
వీలులేదు...
 
దయానంద సర స్వతి బ్రాహ్మణముల ప్రామాణ్యమును తిరస్క
రించుచున్నారు. ఇతరములైన శతపథాది బ్రాహ్మణములకు ఏవిధ
ముగను భిన్నముగాని తైత్తిరీయసంహితలోని బ్రాహ్మణములను
గూర్చి యేప్రకారము వారు చెప్పుదురో? తైత్తిరీయ బ్రాహ్మ
ణములోని అన్ని మంత్రములను వారు తిరస్కరించెదరా?' 'టీవీ