2023-05-14 13:43:29 by ambuda-bot

This page has not been fully proofread.

(8)
 
వేదమతధర్మముల నిర్మూలింపబూనుట యేమిపని ? స్వశరీరాభిమాన
మువలె స్వమతాభిమానము దోషము కాదే. స్వదేశము పరుల ఆక
ఆక
మణమునకు లోనగునపుడు బుద్ధిమంతుల కుపేషణీయము కానట్లు,
స్వమతము పరుల దూషణములకు పాలగునపుడు బుద్ధిమంతుల కుపేత
ణీయము కాదని చెప్పవలెనా ?
 
భారతభూమికి సహజమైన వేదమతము ఆస్తికమత మనబడును.
వేద మప్ర్రమాణము, ఈశ్వరుడు లేడు, జన్మాంతరము లేదు, చేసిన
పుణ్యపాపములు ఫల మీయకుండపోవును విగ్రహారాధన వ్యర్థము.
ఇత్యాది వాదములు కలవి నాస్తికమతము లనబడును. ఇట్టి వాదము
లను యు క్తి ప్రమాణానుభవములతో నిరాకరించునట్టిది ఆస్తి కమతము.
 
ఆస్తి కమతాభిమానులు నిరాశేపముగా ఆస్తికసిద్ధాంతములను
తెలిసికొని తమ విశ్వాసమును దృఢపరచుకొని నాస్తికవాదములకు
మోసపోకుండుటకుగాను
దిజ్మాత్రము పూర్వోత్తర భాగములుగా
'ఆస్తికత్వము' అను ఈ గ్రంధము రచింపబడినది. బుద్ధిమంతులు దీని

ను పేక్షింపక శ్రద్ధతో చదివి స్వమతవిశ్వాసప్రకటనముతో వేదో శోక్త
ధర్మాచరణముతో కృతార్థులు కావలసిన దనియే మావిజ్ఞప్తి.
 
మహోపాధ్యాయ, వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి.