2023-05-14 13:43:29 by ambuda-bot

This page has not been fully proofread.

ఇట్టి వేదమతము భారతదేశమునకు సహజమై భారతీయు
లెల్లరకు అతివిశ్వాసపాత్రమై కోణకోణములలో వ్యాప్తమై నేటికిని
విరాజిల్లుచున్నది. ఈ దేశము మతాంతరస్థుల పరిపాలనలో బడినది
మొదలు పరిపాలకుల మతమును ప్రజలలో వ్యాపింపజేయు రాజనీతి
నొకదాని నవలంబించి స్వమతాభినివేళము కల ఆయా పరిపాలకులు
తమతమ మతమును నయమునను భయమునను ప్రజలచే నవలంబింప
జేయుచు వేదమతదూషణములతో గూడిన పుస్తకములతో
ప్రచారము
గావించుటలో భారతీయులలో సంస్కృతభాషాభ్యాసము లేకుండ
పోవుట, రాజకీయభాషాభ్యాసమే జీవనాధార మగుట, అందు వేద
మతదూషణగ్రంథములనే చదువుట తటస్థించి క్రమముగా కొందరిలో
పరమతపురస్కారము, స్వమతతిరస్కారము ఏర్పడినవి.
 
ఇట్టివారు స్వమతమైన వేదమతమును విడనాడి పరమతచ్ఛా
యల నాశ్రయించి వేదమతమునకు చెందిన నియమములలోని కొన్ని
నియమములనుమాత్రము వ్యవహార సౌకర్యముగా గ్రహించి ఒకొక
పేరుతో ఒక్కొక సమాజమును నెలకొల్పుచు వచ్చిరి. ఇవన్నియు పర
స్పర భేదము కలిగి ఐకమత్యము లేకున్నవయినను వేడమతదుషణ
ములో మాత్రము అస్నియు నై కమత్యము కలిగియే యున్నవి.
 
ఇన్ని మతాంతరములు శత్రుస్థానముగా దేనిని పరిగణించుచు
పోరాడుచున్నవో ఆ వేదమతము నేటికిని భారతభూమిలో స్వస్వరూ
పముతో నిలబడి ఎట్టి ప్రతిఘటనలకును జంకక నియమబద్ధమైన ఐహి
కాముష్మిక వ్యవహారములకు మూలమై విరాజిల్లుచుండుటకు దానికి
గల ప్రమాణబలము, యుక్తి బలము, అనుభవబలము, ఈశ్వరానుగ్రహ
బలముతప్ప మరేమి బల మున్నది ?
 
భారతభూమికి ఈశ్వరానుగృహీతమై సహజమై యున్నది వేద
 
మతము. ఆగంతుకము లగు మతాంతరములును
 
ఈ భారతభూమి
 
నాశ్రయించినవి. అవి వేదమతమును విద్వేషించుటే అన్యాయము.
దాని నాక్రమించుటను గూర్చి చెప్పవలెనా? ఏమతస్థు లామతధర్మము
లవలంబించి తమ తమ హద్దులలో సంచరింపవలసియుండ వారందరును