2023-05-14 13:43:28 by ambuda-bot

This page has not been fully proofread.

ఆస్తికతాయై నమః.
 
"శ్రీబాల వ్యాస" వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రులుగారు వ్రాసిన
"ఆస్తికత్వ"మను గ్రంథమును నే నామూలాగ్రముగ జూచితిని.
గ్రంథము ఆస్తికుల ఆస్తికతను వృద్ధిపరచుటయందును, నాస్తికత్వ
మను అంధత్వమును తొలగించి నాస్తికులనుకూడ మార్పు చేయుట
యందును అత్యంతోప కారకమైనదని చెప్పుటలో యేమాత్రము అతి
శయోక్తి లేదు. ఆస్తికతాపచారము చేయు పండితవ రేణ్యులకు
 
కూడ చాల నుపకారకముగనుండు ననుటలో సందేహము లేదు. అనేక
 
గ్రంథములనుండి చక్కని యుక్తుల బదర్శించి నేటి కుయుక్తుల
ఖండించి, ఆస్తికతను నిరూపించుటలో వీరి విమర్శనాశ క్తి, బహుగ్రంథ
దష్టృత్వము, వెల్లడి యగుచున్నవి. ఒక్కొక్కతరి వీరు నేటి విమర్శ
కుల ప్రశ్నలను, వాటి సమాధానములను ప్రాచీన గ్రంథములలో
ప్రదర్శించిన సందర్భము జూడ వీరి యాస్తికతామూలకమగు ఆర్తిని
చూచి అంతర్యామి యగు భగవానుడే స్ఫురణ కలుగ జేసెనని యని
పించుచుండును. వేయేల యీ గ్రంథము అలౌకికములగు సర్వలోక
తత్సాధనముల చూపించుటయందు చదుర్భూతము. కాన యెల్లరు
యీ గ్రంథమును చక్కగ జదివి చదుష్మంతులై కృతార్థులగుదురుగాక.
ఇట్లు.
 
మండలిక వెంకటశాస్త్రీ.
 
ఏలూరు.
9-10-56
 
పీఠికాపురమున కొన్ని సంవత్సరములు 'వాల వ్యాస'
వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ప్రవచనము చేసిన శ్రీమద్భా
గవత పురాణము యొక్క పరిపూర్తి సందర్భమున స్వస్తిశ్రీ మన్మథ సం॥
మాఘ ౭॥ విదియ మొదలు జరిగిన శ్రీమద్భాగవతసప్తాహ మహోత్స
వములో సమావేశితులగు పండితవరేణ్యుల
 
అభిప్రాయము.
 
'బాల వ్యాస' బ్రహ్మశ్రీ
రచితమైన "ఆస్తికత్వము' అను
గ్రంథరాజము శుతిస్మృతిప్రమాణనిబద్ధమై,
 
వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రుల వారిచే
సర్గ్రంథము నవలోకించితిమి. ఈ
శ్రుతిసమ్మతయుక్త్యుప్