2023-05-14 13:43:28 by ambuda-bot

This page has not been fully proofread.

(²)
 

 
వైదికధర్మముల కళనిపాతముగా విజృభించుచున్న నేఁటి విప
రీత సిద్ధాంతములు కలిప్రభావమున వెలువడుచున్నవని గ్రహించియు
నాస్తికత్వము నరికట్టుటకై నడుముకట్టుకొని నిల్చిన జగజెట్టులు
బ్ర॥శ్రీ॥ వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రులవారు. వీ రాజర్ష సంప్రదాయమున
వేదశాస్త్రపురాణాదులఁ బరిశీలన పూర్వకముగా నధ్యయనించి, బోధించి,
యాచరించుచు, లోకహితకాండులై, ధర్మాధర్మస్వరూపనిరూపణ
మొనర్పఁబూనిన కర్మయోగులు. వారే యీ "యాస్తికత్వ'' గ్రంథ
నిర్మాతలు. భారతగ్రంథముపై వెలువడిన వివిధ, విపరీత, విరుద్ధ, విచిత్ర,
విమర్శముల నన్నిటిని తూర్పాఱఁ బట్టి భారత తత్త్వమును 6 భాగ
ములుగల 1482 పుటల గ్రంథముగ రచించి భారతజాతి పరువు ప్రతిష్ఠ
నిలిపిన బాల వ్యాస బిరుదాంచితులు. అ ఇ ఉణ్ణులాదిగా ఆ భాష్యము
వందలకొలఁది శిష్యులకు ఆర్ష సంప్రదాయమున బోధించిన కులపతులు.
వ్యాకరణశాస్త్రమే కాక తర్క, వేదాంత శాస్త్రములను గురు
శుశూషాపూర్వక మభ్యసించినవారు ఋగ్వేదపండితుల నింట నిలుపు
కొని తమ నలువురు పుత్రులకు స్వశాఖాధ్యయన భాగ్యము నందించిన
స్వధర్మతత్పరులు. భారతతత్త్వకథనమునకై అష్టాదశ పురాణములు,
నుపపురాణములు, మన్వాదిధర్మశాస్త్రములు, ఇవియవి యన నేల ?
ఆర్ష గ్రంథ భాండాగార మంతయు ప్రత్యక్షర పరిశీలన పూర్వకముగాఁ
జదివి, చదివినదాని సారము నంతయు నిస్స్వార్థముగా వెలువరించిన
కారుణికులు. కావుననే చార్వాకమతానుయాయులగు వితండా వాదు
లతో డీకొనఁ గలిగినారు. నేఁడు బౌద్ధమతప్రచారమునకై తలయెత్తు
చున్న విచిత్ర సిద్ధాంతముల నన్నిటిని బరిశీలించి నిస్సారములని ధ్రువ
పఱుచుటయే కాక, గౌతమబుద్ధుడే బౌద్ధమతాదిమస్త్రష్ట కాఁడని
బుద్ధనానాత్వమును బౌద్ధగ్రంథములనుండియే నిరూపించినారు. నిరా
ధారముగా నేవిషయమును నెందుకు చూపలేదనిన శ్రీ శాస్త్రుల వారి
వాఁతయందలి ప్ర్రామాణికతను గూర్చి వేఱ చెప్పుట యెందులకు ?