ఉపనయనము ఎందుకు? # WA శ్రీపాదుక ఆచార్య కొల్లూరు అవతారశర్మ ఉపనయనం ఉపనయనం అంటే ఏమిటి? ఇది ఎందుకోసం? దీనివల్ల మనకొరిగే ప్రయోజనమేమిటి? దీనిని చేయ నందువల్ల మనం కోల్పోయేదేమిటి? ఈ విషయాలను సప్రమాణంగా తెలుసుకుంటే, ఈ ఉపనయన సంస్కారాన్ని మనం ఆదరించాలో విడిచిపెట్టాలో నిర్ణయించవచ్చు. జన్మతః మనిషికీ పశువుకూ తేడా యేమీ లేదు. పశువుకన్నా మనిషికి స్వయంగా ఆలోచించే శక్తి, ఆ ఆలోచనలను కార్యరూపంలో పెట్టి, వానిని మాటలద్వారా ప్రకటించే సామర్థ్యమూ ఉన్నాయి. ఈ సంకల్పశక్తి, బోధనశక్తి రెండింటివల్ల తాను ఉన్నతోన్నతములైన అనుభూతులను పొంది, వానిని ఇతరులకు బోధించి అతడు సమాజాన్ని ఉద్ధరించగలడు. కాకుంటే ఆ దిశగా అతడు మలచబడాలి. అంటే శిక్షణ పొందాలన్నమాట! 1 తరువాత త్రైవర్ణికులకు అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు 'ఉపనయన'మనే సంస్కారం ప్రత్యేకంగా నిర్దేశించబడినది. విద్య, రక్షణ, వాణిజ్యము ఈ మూడూ సమాజాన్ని సర్వాంగీణంగా, సర్వతో ముఖంగా ముందుకు నడిపిస్తాయి. తద్వారా దేశప్రతిష్ఠ సుప్రతిష్ఠితమవుతుంది. అందుకు ఈ మూడు బాధ్యతలను నిర్వహించే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు విచక్షణతో కూడిన విశిష్టమైన ప్రశిక్షణ ఎంతైనా అవరం. ఆ అవసరాన్ని తీర్చడం కోసం సాక్షాత్తుగా వేదర్షులు వేదధర్మంగా ఈ ఉపనయన సంస్కారాన్ని ఉపదేశించేరు. 'ఉపనయనం' ఈ పదంలో ఉపనయనం అని మరి రెండు పదాలు కనిపిస్తాయి. 'ఉప' అనే ఉపసర్గకు సమీపము అని అర్థము. 'నయనము' అనే పదానికి నేత్రము మరియు 'తీసికొనివెళ్లుట' అని రెండర్థాలున్నాయి. నేత్రము అనే అర్థాన్ని భావిస్తే 'సమీపమున నున్న కన్ను' అనగా మన రెండు చర్మచక్షువుల నడుమనున్న 'దివ్యచక్షువు' లేదా 'జ్ఞాననేత్రము' అనే అర్థం సిద్ధిస్తుంది. 3 ఈ ప్రశిక్షణను పొందిన మనిషి మనీషిగా, వ్యక్తిగా రూపొందుతాడు. అతనిలో ఒక ప్రకాశవంతమైన దివ్యచైతన్యం ఆవిర్భవిస్తుంది. అటువంటి వ్యక్తిలో దైవీగుణాలు వెల్లివిరుస్తాయి. అతడు సాధారణ మానవ అవస్థ నుండి దివ్యత్వాన్ని సంతరించుకుని 'భూసురుడు' - 'భూమిపై చరించే దేవుడుగా' గౌరవింపబడతాడు. ఇలా మానవునిలో గుప్తంగా ఉన్న దివ్యశక్తులను ప్రకాశింపచేయడానికి గాను తపోధనులైన మన మహర్షులు కొన్ని సంస్కారాలను సూచించేరు. బాగుగా తోమిన రాగిపాత్ర చిలుము వదలి ప్రకాశించినట్లుగా, ఈ సంస్కారములచే సంస్కరించబడిన వ్యక్తి, ఈ భూలోకంలో దివ్యత్వంతో ప్రకాశిస్తాడు. మాతృగర్భంలో పడడం మొదలుకొని, జన్మించి జీవయాత్ర చాలించేవరకు ప్రధానంగా పదహారు సంస్కారాలను మన మహర్షులు నిర్దేశించేరు. ఈ క్రమంలో గర్భాదాన, పుంసవన, సీమంతోన్నయన, జాతకర్మ, నామకరణ, చౌలములనే సంస్కారముల 2 ఆ జ్ఞాననేత్రమునకు సత్యము స్పష్టంగా కనిపిస్తుంది. సత్యమును దర్శించినవాడు దివ్యత్వమును పొంది భూమిపై దేవుడుగా అందరిచే పూజింపబడతాడు. ఇక తీసికొనివెళ్లుట అనే రెండవఅర్థాన్ని గ్రహిస్తే విద్యాబుద్ధులు నేర్పించడం కోసం తల్లిదండ్రులు తమ బిడ్డను ఆచార్యుని సమీపమునకు తీసికొనివెళ్లి అతనికి వప్పగించుట అనే అర్థం సిద్ధిస్తుంది. ఇది నేడు పిల్లలను బడిలో చేర్పించడమన్నమాట. ఈనాడు మనం విద్యాలయాల్లో చదువుకొంటున్నాం. ఆనాడు ఉపనీతులైన విద్యార్థులు విద్యను సక్రమమైన పద్ధతిలో స్వయంగా ఆర్జించేవారు. కాగా, పరిశీలిస్తే తమ బిడ్డలు విద్యాబుద్ధులతో దివ్యత్వాన్ని సంతరించుకుని పూర్ణపురుషులు కావాలని తల్లిదండ్రులు చేసే గొప్ప ఉదాత్తమైన సంస్కారం ఉపనయనం అని సారాంశం. ఉపనయనం ఎపుడు చేయాలి? వసంతకాలంలో బ్రాహ్మణులకు, గ్రీష్మర్తువులో క్షత్రియులకు, శరద్రుతువులో వైశ్యులకు ఉపనయన 4 సంస్కారం విధాయకంగా చెప్పబడింది. వసంతకాలం బ్రాహ్మణులకు నిర్దేశించబడింది. కారణం, అది ప్రశాంత వాతావరణంలో వేదవిద్యాధ్యయనమునకు అనువైనది. గ్రీష్మఋతువులో సూర్యతాపమధికంగా ఉంటుంది. అది ప్రతాపమునకు చిహ్నము. కావున క్షత్రియులకు నిర్దేశించబడినది. శరదృతువు వాణిజ్యమునకు అనువైన కాలం. వాణిజ్యము ద్వారా సంపద్వృద్ధికి తోడ్పడుతుంది అది వైశ్యులకు అభీష్టమైన సమయము. కావున ఆ సమయము వైశ్యులకు నిర్దేశించబడినదని గ్రహించాలి. ఉత్తరాయణంలో ఉపనయనం చేయడం మంచిది. అందునా చైత్రవైశాఖ మాసములు ఉత్తమములు. మాఘ ఫాల్గుణ జ్యేష్ఠమాసములు మధ్యమములు. ఉత్తరాయణము లోనివే యైనను పుష్య, ఆషాఢమాసములు అధమములుగా చెప్పబడినవి. 'గర్భాష్టమేషు బ్రాహ్మణముపనయీత' అని బహు వచనంగా ఆపస్తంబ గృహ్యసూత్రాల్లో బ్రాహ్మణునకు గర్భాష్టమములయందు అనగా 7సం॥లకు అటునిటుగా 5 2. వేదాధ్యయనం వల్ల తేజస్సు, ఓజస్సు, వర్చస్సు, యశస్సు, మహస్సు, జ్ఞానం సిద్ధిస్తాయి. 3. లోకంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. 4. శ్రాతకర్మలయందధికారం లభిస్తుంది. బ్రహ్మచర్యం వల్ల తేజస్సు, ఓజస్సు, జ్ఞానం, దినదినాభివృద్ధి చెందుతాయి. క్రమంగా ద్విజత్వం తద్వారా దివ్యత్వం సిద్ధిస్తాయి. 5. శ్రేయస్సులన్నింటికీ కారణభూతమైన గాయత్ర్యుపాసన సంప్రాప్తిస్తుంది. అది బ్రహ్మవిద్య లేదా మోక్షవిద్యకు మూలకారణమైనది. తద్వారా ఆత్మజ్ఞానము, బ్రాహ్మీస్థితి జీవన్ముక్తి లభిస్తాయి. ఈ స్థితిని పొందడమే మానవజన్మకు చరితార్థత. 6. అధ్యయన, అధ్యాపన, యజన, యాజన, దాన, ప్రతిగ్రహములకు అర్హత లభిస్తుంది. దీనివల్ల ఆర్థికప్రయోజనంతో పాటు గౌరవప్రతిష్ఠలు ఆముష్మిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. 7 ఉపనయనాన్ని విధించింది. వటువు సూక్ష్మబుద్ధి కలవాడైతే 5వ ఏట కూడా చెయ్యవచ్చును. 'దశమే పంచమే వా కామ్యమ్' అనగా సూక్ష్మబుద్ధి కలవాడైతే ఐదవయేట, మందబుద్ధి కలవాడైతే 10వ సంవత్సరం లోగా ఉపనయనం చెయ్యాలని శాస్త్రం. కశ్యపమహర్షి వచనాన్ననుసరించి 10 సం॥లలోపల ఉపనయనం చేయుట ఉత్తమమనియు, 13 సం॥ల లోపల ఉపనయనము చేయుట మధ్యమమనియు, 16 సం॥ లోపల ఉపనయనము చేయుట అధమమనియు అటుపైన వ్రాత్యత్వ దోషము సంక్రమించి భ్రష్టుడు లేదా పతితుడౌతాడని గ్రహించాలి. 16 సం॥లు దాటిన తర్వాత వ్రాత్యత్వ దోషనివారణార్థమై ప్రాయశ్చిత్తం చేసి ఉపనయనం చేసుకునే వెసులుబాటు కల్పించింది శాస్త్రం. ఉపనయనం చెయ్యడం వల్ల ఒరిగేదేముంది? లేకుంటే పోయేదేముంది? 1. ఉపనయనం చెయ్యడం వేదాధికారం అంటే వేదములను చదువుకోవడానికి అర్హత కలుగుతుంది. 6 ఉపనయనమే గనుక చేయకుంటే : 1. కుమారుడు అగ్నికార్యము, గాయత్రీ మంత్ర జపానుష్ఠానములకు అర్హతను కోల్పోతాడు. అంటే ఆధ్యాత్మిక పురోగతిని సాధించలేడు. 2. గురుకులవాసం వల్ల లభించే క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఇంద్రియ సుఖములకు బానిసయై చరిత్ర హీనుడయ్యే అవకాశముంటుంది. అంటే అన్ని విధములా భ్రష్టుడైపోతాడని భావం. 3. సాటివారికి లభించే గౌరవప్రతిష్ఠలు లభించకపోవడం వల్ల, వీరిలో ఆత్మన్యూనతాభావం కలుగవచ్చు. అది వ్యక్తిత్వ వికాసానికి ప్రతిబంధకము. 4. ఇలా తన ఆత్మన్యూనతాభావాన్ని విస్మరించడానికై యతడు వ్యసనములకైనా బానిస అవుతాడు లేదా అశక్తదుర్జనత్వంతో సమాజవిద్రోహకార్యక్రమములకు తలబడతాడు. ఇలా యువత పెడదోవ పట్టి చెడిపోయే ప్రమాదమున్నది. ఇది సామాజిక సువ్యవస్థను భగ్నం చేస్తుంది. ఆ స్థితికి తమ సంతతి 8 చేరకుండా ఉండాలంటే, తమ బిడ్డలు సర్వాంగీణంగా సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలంటే, తప్పకవారు ఉపనయన సంస్కారం పొందాలని తల్లిదండ్రులు గ్రహించాలి. లేకుంటే 'మాతా శత్రుః పితా వైరీ యేన బాలో న పాఠితః' తమకు తగు సమయంలో తగినట్లుగా విద్యాబుద్ధులు చెప్పించని తల్లిదండ్రులను బిడ్డలు శత్రువులుగా సంభావించి నిందిస్తారు. తుదకు వారు సంఘవిద్రోహశక్తులుగా మారిపోయే అవకాశ మున్నది. కావున బుద్ధిజీవులైన త్రైవర్ణికులు ముఖ్యంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మువ్వురు తమ బిడ్డలకు సకాలంలో ఉపనయన సంస్కారం జరిపించి వారికి తగిన మార్గనిర్దేశం చెయ్యాలి. 5. నేడు తరుణావస్థలోని విద్యార్థులెందరో జ్ఞాన సముపార్జనా దక్షులై యుండి కూడా విద్యాసముపార్జన లోని ఒత్తిడులను తట్టుకొనలేక పిచ్చెత్తి, ఆవేశ కావేశములకు లోనై తుదకు ఆత్మహత్యలకు కూడా పాల్పడుచున్నారు. మరికొందరు నేరప్రవృత్తి 9 అనగా కొద్దిపాటి భోజనస్వీకారనిరతుడై, అధమపక్షం మూడు రాత్రులు, లేదా యధాశక్తిగా, 12 రాత్రులు లేదా ఒక సంవత్సరకాలము బ్రహ్మచర్య అధఃశయన అగ్నికార్యజప హోమతత్పరుడై, వ్రతనిష్ఠయందుండి తరువాత వ్రతపరిసమాప్తి సూచకంగా 'మేధాజననం' చేసుకోవాలి. మేధాజననంతో ఉపనయన సంస్కారం పూర్తయినట్లు గ్రహించాలి. మేధాజనన పర్యంతము తాను నిత్యము అగ్నికార్యం చేస్తున్న అగ్నిహోత్రం ఆరిపోకుండా పరిరక్షించుకోవాలి. ఒకవేళ అగ్నిహోత్రం చల్లారితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నమాట. అందుకని కనీసపక్షం త్రిరాత్రవ్రతం తరువాత నాలుగవరోజున మేధాజననంతో పూర్తయ్యేలా 4 రోజుల పాటైనా ఈ ఉపనయన సంస్కారంతో మన బిడ్డలను సంస్కరింపచేసుకోవాలి. ఇది త్రైవర్ణికులైన తల్లిదండ్రుల బాధ్యత. దీనిని సక్రమంగా నెరవేర్చకపోతే వారు తమ బిడ్డల అధ్యాత్మిక పురోగతికి ద్రోహం చేసినట్లే. నేడు ఉపనయనాన్ని ఏదో వివాహమునకు 11 కలవారవుతున్నారు. సకాలంలో ఉపనయన సంస్కారమే వీరికి చేసియుంటే వారికీ విధమైన దుస్థితి పట్టి యుండెడిది కాదని చేతులు కాలిన పిమ్మట వారి తల్లిదండ్రులు పశ్చాత్తాప పడడం మనం చూస్తూనే ఉన్నాం. ఉపనయన సంస్కృతులైనవారు గాయత్రీ జపానుష్ఠానము, సకాలసంధ్యావందనము, బ్రహ్మచర్య పాలనముల వల్ల ఇంద్రియ నిగ్రహము, కార్యదక్షత, ఓజస్సు, తేజస్సులను కలిగి ఒత్తిడులను అతిక్రమించి ఉన్నత శిఖరాలను అన్ని రంగాలలోనూ అధిష్ఠిస్తారనేది నిర్వివాదాంశం. నూటికి నూరుపాళ్లు నిజం. ఉపనయనం ఎన్ని రోజులు చేయాలి? ఉపనయన సంస్కారాన్ని కనీసపక్షంగా నాలుగు రోజులు జఱిపించాలని శాస్త్రం. ఎందుకంటే ఉపనయన సంస్కారముచే సంస్కరింపబడిన వటువు కేవలం సాత్వికాహార నిష్ఠతో అనగా క్షారలవణ వర్జితాహారమును, క్షీరాన్నము, ఆవుపాలు మాత్రము సేవిస్తూ 'లఘ్వాశీ' 10 ప్రతిబంధకత్వమును తొలగించే తంతుగా ఒకపూట నిర్వహించి చేతులు దులిపేసుకుంటున్నారు. దీనివల్ల వ్యయప్రయాసలే తప్ప వటువునకు ఏ విధమైన ప్రయోజనము ఉండదు. కనీసము త్రిరాత్రవ్రతమునైనా బ్రహ్మచర్యాధశ్శయన క్షారలవణవర్జన నియమములతో ఆచరించినవారికి 'మేధాజననం' సిద్ధిస్తుంది. మంత్రానుష్ఠానార్హత లభిస్తుందని గ్రహించాలి. కాగా, నేడు మనం చేస్తున్న ఏకరాత్రోపనయన సంస్కారము అశాస్త్రీయము, వ్యర్థముగా గ్రహించాలి. అసలు మానేయడంకన్నా సకాలంలో ఒకరోజైనా జరిపి గాయత్ర్యుపదేశార్హత కోల్పోకుండా పిల్లలను వ్రాతృత్వ దోషం నుండి రక్షిస్తున్నామని సమర్థించుకుంటున్న తల్లిదండ్రులకు నమస్కారం! ఉపనయన సంస్కారం : ఈ ప్రక్రియలో ప్రధానంగా రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణం, నాందీ సమారాధనం, లఘుభోజనం (తల్లి లేదా చెల్లి)తో, కేశవపనం (పంచశిఖలను ధరింపచేయుట), 12 అగ్న్యాధానం, అఘోరహోమం, అశ్మారోహణం, మౌంజ్య జినదణ్ణధారణము, ఆచార్యునిచే కుమార పరిగ్రహణము, ఆచార్యుడు శిష్యుని అగ్న్యాది దేవతలకు వప్పగించుట, సుముహూర్తం (జీలకఱ్ఱ, బెల్లం), మంగళాష్టకములు, గురుపాదోపసంగ్రహణము, గాయత్ర్యుపదేశము, ఉభయ వ్రతోపదేశము, గోదానము, సూర్యసందర్శనము, అగ్ని కార్యము.(ఈ అగ్నిని మూడు రాత్రులు పరిరక్షించుకోవాలి. త్రిరాత్రవ్రతనిష్ఠుడై ప్రాతరగ్నికార్యము, గోత్ర ప్రవరలతో అనుశాసనము, భిక్షావందనము, (మాతృభిక్షతో ప్రారంభించాలి). సదస్యం, సాయంకాలం మరల సంధ్యావందనం అగ్నికార్యాలతో మొదటిరోజు కార్యక్రమం పూర్తవుతుంది. ఇలానే రెండుపూటలా సంధ్యావందనము, అగ్నికార్యము విధిగా చెయ్యాలి. మధ్యాహ్నం సంధ్యావందనం చేస్తే సరిపోతుంది. ఈ విధంగా రెండురోజులు చేసి, నాలుగవ రోజున పాలాశప్రయోగము - మేధాజననము. మోదుగచెట్టు మొదటలో దాని కొమ్మను పాతి దానివద్ద 13 ఉపవీతముగా ధరింపబడుచున్నది కావున దీనికి యజ్ఞోపవీతమని పేరు. యజ్ఞస్య ప్రసృత్యా అజినం వాసోవా దక్షిణత ఉపవీయ దక్షిణం బాహుముద్దరేత్ వధత్తే సవ్యమితి యజ్ఞోపవీతమ్ - అని యజ్ఞోపవీతం నిర్వచింపబడినది. దేవతానుగ్రహం కోసం చేయబడిన యే కర్మయైనా యజ్ఞమే. 'ఉపవ్యయతే దేవలక్ష్మమేవ - తత్కురుతే ఇత్యుపవీతమ్' 'దేవలక్ష్మ' దే అంటే దేవుడని తెలిపే చిహ్నము. ఇది ధరించినవాడు భూలోకంలో దేవుడేనని ఈ ఉపవీతం తెలియజేస్తుందట. కాగా మానవుడు దివ్యత్వాన్ని పొందడానికి ఇది పాస్పోర్టులా ఉపయోగపడుతుందని భావం. ఇది ఆ అర్హతను సూచిస్తుందన్నమాట. ఏమిటీ ఉపవీతం? దీనికింతటి మాహాత్మ్యం ఎలా వచ్చింది? అనే విషయం కొద్దిగా తెలుసుకుందాము. ఉపవీతమంటే దారాలుచే పేనబడిన ఒక త్రాడు. సువాసినీ స్త్రీ వడకిన దారంతో, వేదపఠనం చేస్తున్న బ్రాహ్మణుడు 15 పాలాశప్రయోగము చేయాలి. దీనిలో ప్రణవ శ్రద్ద మేధా దేవతలనర్చించి, పాలాశదండమును మేఖలాజినములను మోదుగ చెట్టు మొదట విసర్జించి, నూతన వస్త్రములను ధరించి, భోజన సంతర్పణాదులచే బ్రాహ్మణులనర్చించి, వారి యాశీస్సులను పొందుతారు. ఈ పలాశ ప్రయోగమునే మేధాజననమంటారు. ఈమేధాజననంతో ఉపనయన సంస్కారదీక్ష పరిసమాప్తమవుతుంది. ఈ అంశాలను కొద్దిగా తెలుసుకుందాం. ఉపనయన సంస్కారంలోని మొదటి అంశం 1. రక్షాబంధనం : సంకల్పించిన యీ ఉపనయనం నిర్విఘ్నంగా కొనసాగించవలసినదిగా ముందుగా రక్షాబంధన దేవతలను 'విశ్వేత్తాతే'... అనే మంత్రంతో ఇంద్రుణ్ణి, 'బృహత్సామ... మంత్రంతో పుంస్త్యమును, బలమును వటువునకు చేకూర్చి మమ్ములను కూడా రక్షింపవలసినదని ప్రార్థించి రక్షాబంధనం ధరిస్తారు. 2. యజ్ఞోపవీతధారణం: రక్షాబంధనము తరువాత యజ్ఞోపవీత ధారణకు సంకల్పిస్తారు. యజ్ఞ్యార్థమై 14 96 బెత్తల ప్రమాణంతో 9 పోగులు లేదా దారములతో మూడు సూత్రములుగా పేని తయారుచేస్తారు. 3 పోగులను కలిపి ఒక గ్రంథి (ముడి) వేస్తారు. ఈ సూత్రమును ప్రప్రథమంగా బ్రహ్మగారు కల్పించిన కారణంగా దీనికి బ్రహ్మసూత్రమని, యీ గ్రంథికి బ్రహ్మగ్రంథి లేక బ్రహ్మ ముడి అనిన్నీ వ్యవహారమేర్పడింది. బ్రహ్మాగ్రే కల్పయామాస వేదార్హాణామనుత్తమమ్ యస్య చ ధృతిమాత్రేణ బ్రహ్మసూత్రేణ తే ద్విజాః భవన్తి బ్రాహ్మణా నామ్నా దేవార్హాశ్చ త్రయస్త్విహ - అని స్మృతి వచనం. ఇంకా స్వాధ్యాయబ్రాహ్మణంలో కేవలం బ్రహ్మ సూత్రాన్ని అంటే యీ యజ్ఞోపవీతాన్ని ధరించిన కారణంగానే దేవాసుర సంగ్రామంలో దేవతలకు విజయం లభించిందని ఒక ఉపాఖ్యానమే 'ప్రసృతాహవై యజ్ఞోపవీతినః ప్రసృతేనవై యజ్ఞేన దేవాః స్వర్గంలోకమయాన్ న ప్రసృతేనా సురాః' అని చెప్పబడింది. 16 కాగా యజ్ఞోపవీత ధారణ వల్ల సర్వక్యాజయం లభిస్తుందని భావం. ఒక సూత్రప్రమాణం 96 బెత్తలుంటుందని చెప్పుకున్నాం. ఇది 96 సం॥ల కాలప్రమాణానికి ప్రతీక. మధ్యలో ప్రసక్తమయ్యే అధికమాసాలతో కలిపి శతాయుః ప్రమాణాన్ని శతం జీవ శరదో వర్ధమానః అని అనుగ్రహిస్తుంది మంత్రపూతమైన ఈ యజ్ఞోపవీతం. కాగా, యజ్ఞోపవీతం అపమృత్యువును వారించి, పూర్ణాయుర్దాయాన్ని అనుగ్రహిస్తుందని భావం. ఇందులోని 9 దారాలకు క్రమంగా ఓంకారము లేదా ప్రణవము, అగ్ని, ఇంద్రుడు, సోముడు, పితరులు, ప్రజాపతి, విష్ణువు, సూర్యుడు మిగిలిన సర్వదేవతలు అధిదేవతలుగా (ఓంకార ప్రథమస్తన్తుః । ద్వితీయోగ్ని స్తథైవచ । తృతీయోభగదైవత్యం । చతుర్థో సోమదేవకః । పంచమః పితృదైవత్యో । షష్టశ్చైవ ప్రజాపతిః । సప్తమో వసుదైవత్యః ధర్మశ్చాష్టమ ఏవచ నవమః సర్వదైవత్యః ఇత్యేతే నవ తస్తవః) అని చెప్పబడినారు. 17 తపోహరమ్' పొట్టిగా ఉంటే ఆయుష్షును, పొడుగ్గా ఉంటే చేసిన తపస్సును హరిస్తుందట. అలానే 'యశో హరతి వై స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్' లావుగా ఉంటే కీర్తిని, మరీ సన్నగా ఉంటే ధనమును హరిస్తుందట. అందుకని 'సిద్ధార్ధఫలమానంస్యాత్' నిర్ణీతమైన ప్రమాణాలతో ధరించబడిన యీ యజ్ఞసూత్రం నిజంగా దివ్యత్వాన్నే అనుగ్రహిస్తుంది. 'ఆకటేస్తత్ప్రమాణం స్యాత్' అంటే ఎడమభుజముపై నుండి కటి (నడుము) వరకు వ్యాపించి ఉండడమనేది దీనియొక్క ప్రమాణమని స్థూలంగా తాంత్రికులు నిర్ణయించేరు. వారి పరిభాషలో మూలాధారం నుండి బ్రహ్మరంధ్రము వద్ద గల సహస్రారపర్యంతమైన కులమార్గము లేదా జ్యోతిష్పథము ఈ సిద్ధార్థ ఫలమానంగా చెప్పబడింది. లలితా సహస్ర నామాల్లో కూడా ఈ మార్గంగుండా ప్రయాణించే చైతన్యశక్తి కుణ్డలిని గ్రంథిత్రయాన్ని భేదిస్తూ చేసే ప్రయాణం 'మూలాధారైకనిలయా బ్రహ్మగ్రంథి విభేదినీ మణిపూరాంతరుదితా విష్ణుగ్రందివిభేదినీ - ఆజ్ఞా చక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదినీ, సహస్రారాం 19 ఈ విధంగా యజ్ఞోపవీతధారణం చేత సర్వకార్య జయము, ఆయుర్వృద్ధి, అపమృత్యువినాశము లభిస్తాయి. బ్రహ్మజ్ఞానం కూడా సాధకునికి లభిస్తుంది. 'బ్రాహ్మం త్రైపూరుషంమహః' త్రిమూర్తుల యొక్క సమాహృత మూలరూపమే బ్రహ్మము. దానికి సంబంధించిన జ్ఞానము బ్రాహ్మము. "జ్ఞానాత్మకేన హరిణా బ్రహ్మాత్మని శివే వ్యయే తత్సూత్రముపవీతత్వాత్ బ్రహ్మసూత్రమితి స్మృతమ్ తద్గంధిమాశ్రితస్తారః త్రిమాత్రో నాద సంయుతః తద్దంధ్యగ్రేచ సావిత్రీ వేదమాతా శివాజ్ఞయా ॥ అనగా యజ్ఞోపవీతము త్రిమూర్త్యాత్మకము. దాని గ్రంథిని ఆశ్రయించి ఓంకారము గ్రంథ్యగ్రములో శివాజ్ఞచే వేదమాతయైన గాయత్రి ఆశ్రయించి ఉంటాయని శాస్త్రప్రవచనం. ఈ యజ్ఞసూత్రము అదే 96బెత్తల ప్రమాణంలో ఉండాలి. మరీ పొడుగ్గా ఉండకూడదు. అలాగని పొట్టిగా ఉండకూడదు. 'ఆయుర్హరతిహ్రస్వం చాతిదీర్ఘం 18 బుజారూఢా సుధాసారాభివర్షిణీ' మొదలైన నామాల్లో వివరించబడింది. పవిత్రం పరమం శుద్ధం ఆయుష్యం చ శుభావహమ్ ఔజస్యం బ్రహ్మవర్చస్వం బ్రహ్మసూత్రం తథోదితమ్ యజ్ఞోపవీతం చాలా పవిత్రమైనది. ఆయుర్వృద్ధి కరమైనది. శుభప్రదమైనది. ఓజస్సు, తేజస్సు, బ్రహ్మ వర్చస్సులనిస్తుందని చెప్పబడింది. దీనిని అనునిత్యం ధరించాలని శాస్త్రం. 'నిత్యోపవీతీస్యాత్త'ని స్మృతి వచనం. 'కాయస్థమేవధార్యం - నకదాచనోదరే' నేడు కొందరు యజ్ఞోపవీతాన్ని నడుంకు చుట్టబెట్టుకుంటున్నారు. దానిని ఎడమభుజముపైనే ధరించాలి. నడుమునకెప్పుడూ బిగించరాదని అర్థం. 'దినమేకమపి యజ్ఞోపవీతముత్సృజ్య శూద్రత్వమాప్నోతి' అంటే ఒక్కరోజైనా సరే ఉపవీతం లేకుండా ఉండకూదు. ఉంటే గనుక వాడు శూద్రునితో సమానం. ఇంకా 'విశిఖోనుపవీతశ్చ యత్కరోతి తన్నిరర్థకం - సర్వమపికర్మాసురం భవతి' శిఖా యజ్ఞోపవీతములను వర్ణించి చేసిన కర్మలన్నీ ఆసుర 20 కర్మలతో సమానము. వానివల్ల దివ్యత్వము సిద్ధించదు సరికదా ఆసుర లక్షణాలు ప్రాప్తిస్తాయి. కావున ఉపనయనసంస్కారం పొందినది మొదలు జీవిత పర్యంతము సదా యజ్ఞోపవీతమును ధరించాలి. ఉపనయన సంస్కారమైనది మొదలు మన శరీరంలో మంత్రశక్తి సదా ప్రకాశిస్తూ వుంటుంది. ఈ శరీరం ఒక ఛార్జింగ్ బ్యాటరీ అనుకుంటే, దీనికి ఛార్జర్ యజ్ఞోపవీతం. విద్యుత్తు గాయత్రీమంత్రానుష్టానం. ఉపవీతియై నిత్యమంత్రానుష్ఠానం ద్వారా ఈ దేహం దివ్యశక్తితో ముప్పొద్దులా రీఛార్జ్ అవుతూ శక్తిమంతమై అనుదినము దివ్యత్వాన్ని పెంపొందించుకుంటూ తుదకు బ్రహ్మీభూతమైపోతుంది. ఇదీ యజ్ఞోపవీత మాహాత్మ్యం! యజ్ఞోపవీతాలను ఎవరెవరెన్నింటిని ధరించాలి? యజ్ఞోపవీతముగా ఒక ముడిని మాత్రం బ్రహ్మచారి ధరించాలి. 'వటోరేకం-గృహస్థస్య ద్వే' అని శాస్త్రం. గృహస్థులు, వానప్రస్థులు కూడా రెండు ఉపవీతాలను ధరిస్తే సరిపోతుంది. 'యజ్ఞోపవీతే ద్వే ధార్యే శ్రాతే స్మార్తే 21 చేసిన పిమ్మట, యజ్ఞోపవీతమును ధరించాలి. నాలుగు మాసములు గడిచినను జీర్ణోపవీతాన్ని విడిచిపెట్టి నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి. (యజ్ఞోపవీతధారణవిధి చివరిపేజీలో 58లో నున్నది) 3. నాందీ సమారాధనం : యజ్ఞోపవీతధారణమైన పిమ్మట వటువు యొక్క ఆయుష్యాభివృద్ధ్యర్థమై నాందీ శోభన దేవతలను ఆహ్వానించి బ్రాహ్మణ సమారాధన చేయాలి. దీనిలో పాపవిమోచకుడు, అంగిరసుడు, గయుడు, ఆత్రేయుడు, తార్క్ష్యుడు అనువారినర్చించి మహావిష్ణుస్వరూపులైన బ్రాహ్మణోత్తములను గంధాక్షతలతో అర్చించి వారికి యథాశక్తి దక్షిణ, వస్త్ర తాంబూలాదులను సమర్పించాలి. ఈ సమారాధన నేడు బ్రహ్మచారులకు జఱుపుట ఆచారముగా పరిణమించినది. 4. లఘుభోజనం : 'కుమారభుక్తికాలేతు గాయత్రీం సముదాయయన్' బ్రహ్మచారులతో పంక్తి భోజనం పెట్టేటపుడు ఆచార్యుడు 23 చ కర్మణి' అని శాస్త్రం. శ్రాతకర్మాధికార సిద్ధికోసం ఒకటి స్మార్త కార్మధికార సిద్ధి కోసం మఱియొకటి రెండు ధరిస్తే చాలు, శ్రాతస్మార్తాది నిఖిల నిత్యకర్మానుష్ఠాన సిద్ధ్యధికారం లభిస్తుంది. వస్త్రాభావదోష పరిహారార్థం మూడవ యజ్ఞోపవీతాన్ని ఆచారంగా ధరిస్తున్నారు. ఉత్తరీయార్థం నాలుగవది, అయిదవది యజ్ఞాధికారార్థమని, ఇలా 5 ఉపవీతాలను సమాహారంగా ధరిస్తున్నారు. మూడు ముడులకన్నా ఎక్కువగా ఉపవీతమును ధరించనవుసరం లేదు. యతులకు, సన్న్యాసులకు ఉపవీతం ధరించాలనే విధి వర్తించదు. 'నిస్త్రైగుణ్యే పథి విచరతాం కో విధిః కోనిషేధః - అని శాస్త్రం కాగా త్రిగుణాతీతులు కావున వారికి యజ్ఞోపవీత ధారణ విధి కూడా వర్తించదని భావం. నూతన యజ్ఞోపవీతాన్నెప్పుడు ధరించాలి? జాతాశౌచ మృతాశౌచము (పురుడు మరియు మైల) శుద్ధి దినములలోను, గ్రహణానంతర స్నానము (విడుపు స్నానము) తరువాత, శ్మశానమునకేగి తిరిగివచ్చి స్నానము 22 స్వయంగా అన్నాన్ని గాయత్రీమంత్రంతో ప్రోక్షించి వటువుచే క్షారలవణవర్ణ భోజనమును (ఉప్పు, కారం లేకుండా) 'మాత్రాచ సహభోజనమ్' హోమాదులకు పూర్వాంగంగా తల్లితో సహపంక్తి భోజనం చేయించాలి. ప్రస్తుతం ఈ ఆచారం తోబుట్టువు (అక్కచెల్లెలు)తో సహపంక్తి భోజనంగా మన ఆంధ్ర దేశంలో వ్యవహారంలో ఉంది. వటువును 'లఘ్వాశీః' అను ప్రవచన ప్రకారం కొద్దిగా భుజింపచేసి, సహపంక్తి భోజనం చేసిన సోదరికి, సబ్రహ్మచారులకు (పసుపు, పొత్తములు) పసుపులో ముంచిన వమ్రులను బహూకరించే పరిపాటి కనిపిస్తుంది. తరువాత శరీర శుద్ధ్యర్థం పుణ్యాహవాచనం అటుపైన.. 5. కేశవపనం : ఆయుర్వృద్యై కేశవపనమ్ - ఉష్ణన వాయవిత్యాది యజుర్మంత్రములచే సంస్కరించబడిన గోరువెచ్చటి నీళ్ళతో తలను తడిపి వటువునకు ఆయుష్షు, వర్చస్సు, యశస్సు, ఓజస్సు, మహస్సులు సంప్రాప్తించి వర్ధిల్లాలనే 24 అర్థములిచ్చే మంత్రములతో నాలుగు దిశలకు ఆయా దిశాధిపతులకు నమస్కరిస్తూ, ఊర్థ్వదిశను సంభావిస్తూ పంచశిఖలను మూడేసి దర్భలనుంచి కత్తిరించి, నలుదిశలయందు అభిమంత్రించిన కత్తితో వపనము చేసి, 'ఉప్వాయకేశాన్' అనే మంత్రంతో వానిని మేడిచెట్టు మొదట లేదా దానికి ప్రతినిధిగా ఉంచిన దర్భకూర్చము వద్ద ఆ కేశాలనుంచాలి. ఆ పంచదిశల కనుగుణంగా పంచశిఖలనుంచడం ఒక ఆచారం. 'పంచశీర్హోపనయనే జపే వినియోగః' అని పంచశీర్షమైన గాయత్ర్యుపదేశాంగంగా ఆ శీర్షములకు ప్రతీకలుగా పంచశిఖలుంచినట్లు కొందరి భావన. ఉపనయన సూత్రం మాత్రం 'యథార్షి శిఖాని దధాతి' అనగా వటువు యొక్క గోత్ర ఋషుల సంఖ్యను బట్టి శిఖలను ధరింపచేయాలని సూచించింది. ఇలా సూచిస్తూనే 'యథైవైషాం కులధర్మః స్యాత్' అని వెసులుబాటును కూడా సూచించింది. ఇది మా కులాచారమంటూ నేడు అందరూ పంచశిఖల 25 ఆగ్నేయం వరకు 'అఘారావాఘారయతి' అను వచనాన్ననుసరించి అఘారహోమాలను చేస్తాడు. 7. అశ్మారోహణము : (సన్నికల్లుతాతిని తొక్కించుట) అఘారాఘారమైన పిమ్మట 'ఆయుర్దా' మంత్రోచ్చారణ పూర్వకంగా పాలాశసమిధతో హోమం చేయించి, అగ్నిహోత్రమునకు ఉత్తర దిశగా ఉంచబడిన సన్నికల్లు తాతిని వటువు కుడికాలిచే 'ఆతిష్టేమ మశ్మాన మశ్మేవ త్వగ్ స్థిరోభవ'అని చెప్పి త్రొక్కిస్తారు. ఈ తాతిని అధిష్ఠించి దీనివలెనే అచలనిష్ఠతో బ్రహ్మచర్యమును ఆచరించాలనే సందేశం ఈ మంత్రంలో అనుగ్రహింపబడినది. 8. వస్త్రాజిన మౌంజీమేఖలాదండాదిధారణము : శీతవాతోష్ణోపశమన ద్వారా దేహాలంకరణార్థమై ఆభరణముగా అంటే అలంకారము వలె శరీరమునకు శోభనిచ్చే వస్త్రాలంకారములను, కృష్ణాజినము, ముంజ త్రాటితో పేనబడిన మేఖల అనగా మొలత్రాడును ఆ అశ్మ అనగా సన్నికల్లుతాతిపై నుంచినవానిని ప్రోక్షించి ఆచార్యుడు వటువునకు కట్టబెడతాడు. 27 నుంచుతున్నారు. కొందరు సంస్కారమాత్రంగా కత్తెరవేసి వపనం చేయించకుండా శిఖలను ఉంచకుండా ఉపనయనం చేసేస్తున్నారు. వారికో నమస్కారం! శిఖాయజ్ఞోపవీతములు లేకుండా చేసిన కర్మ నిరర్థకమవుతుందని ముందే చెప్పుకున్నాం. 6. అగ్న్యుపధానము : అనగా అగ్నిహోత్రునభ్యర్చించుట అని భావము. వటువు శిఖోపవీతియై చేసే కర్మకాండ అంతా ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది. కావున ఇట నుండి అసలైన ఉపనయన కార్యక్రమము ఆరంభించబడుతుందని గ్రహించాలి. ఈ అగ్న్యాధానాది ఉపనయన కర్మకు అనువైన దర్భలు, ఉదకములు, కూర్చ, వస్త్రము, అశ్మ (సన్నికల్లుతాయి) పాలాశదండము, కృష్ణాజినము, మౌంజీమేఖలను ముందుగా సమకూర్చుకుని ఆచార్యుడు 'చత్వారిశృంగాః' అనే మంత్రాన్ని చదువుతూ అగ్ని భట్టారకుని ప్రార్థించి షట్పాత్రప్రయోగాన్ని ఆచరిస్తాడు. తరువాత ప్రజాపతిని ధ్యానిస్తూ వాయవ్యము నుండి 26 మంత్రముచే పవిత్రీకృతమై ఆచార్యునిచే మూడు చుట్టలుగా చుట్టబడిన ఆ మౌంజీమేఖల ప్రాణాపాన వాయువులకు పుష్టిని కూర్చి వటువు యొక్క ఆయుష్షును వీర్యమును సంరక్షిస్తుంది. దుష్ట ప్రసంగములను నిర్మూలిస్తూ అతడు సంచరిస్తున్న గృహప్రదేశాన్నంతను పవిత్రము చేస్తుంది. 'మిత్రస్యచక్షుః' అనే మంత్రముచే సంస్కరింపబడి ఉత్తరీయముగా ధరింపచేయబడిన కృష్ణాజినము (జింకచర్మము) వటువు యొక్క తేజస్సు, ఓజస్సు, వర్చస్సులను వృద్ధిపరుస్తుంది. 9. ఆచార్యుడు వటువును స్వీకరించుట మఱియు అగ్న్యాది దేవతలకు వప్పగించుట : ఈ విధముగా మంత్రములచే సంస్కరించబడిన నూతనవస్త్ర కృష్ణాజిన, మౌంజీ మేఖలాలంకృతుడైన వటువును ఆచార్యుడు... 'అగ్నిస్తే హస్తమగ్రహీత్' మొదలుగా గల దశ మంత్రములతో కుమారుని కుడిచేతిని పట్టుకుని స్వయముగా కుమారుని స్వీకరించి ఆతని రక్షణ బాధ్యతను మరల ఆ అగ్న్యాది దశదేవతలకే వప్పగిస్తాడు. 28 10. జీలకఱ్ఱ బెల్లం (సుముహూర్తం) : 'మంగళ ద్రవ్యాణి మంగళకరాణి భవేయుః అనగా పసుపు, జీలకఱ్ఱ, బెల్లము, చెఱుకు, పాలు, నెయ్యి, గోరోచనము మొదలగు మంగళ ద్రవ్యములన్నియు కలిపి నూరబడిన యీ మంగళద్రవ్య సంచయము వటువునకు సమస్త మంగళములను కలుగజేయుగాక! అని ఆచార్య దంపతులాశీర్వదించి, లక్ష్మీనారాయణాది సర్వదేవతలకు, సనక సనందాది సర్వఋషులకు, తిథి, వార నక్షత్ర యోగకరణ, ముహూర్త లగ్నహోరాద్రేక్కాణ, నవాంశ, ద్వాదశాంశాౄది సర్వజ్యోతిర్విషయములకు, సర్వగ్రహ నక్షత్ర రాశిచయమునకు, స్వస్తివచనములను పలుకుతూ, చూర్ణికను 'వటుంచతుర్వేద పటుం కరోతు' అనే మకుటంతో మంగళాష్టకములను చదువుతూ, సుముహూర్త సమయంలో జీలకఱ బెల్లం మొదలైన ద్రవ్యములను నూరిన ముద్దను బ్రహ్మరంధ్రముపైనద్ది, వటువును దగ్గరగా తీసికొని, ఆచార్యుడు నూతన వస్త్రముచే తనను, వటువును కూడా ఆచ్ఛాదించి, 29 సమన్వితంగా మూడుపాదాలతో ఉపదేశించబడుతుంది. దీనివలన వాక్శుద్ధి, ఓజస్సు, తేజస్సు, ఆయుష్షు, సంపద, విద్య, ఒకటేమిటి సర్వమూ లభిస్తాయి. గాయత్రీ మంత్రానుష్ఠానము వల్ల మనలోని బుద్ధి వికసించి, ఆంతరమైన దివ్యచైతన్యం అత్యుజ్జ్వలంగా ప్రకాశిస్తుంది. ముప్పొద్దుల గాయత్రీ మంత్రాన్ని వేయిన్నెనిమిది (1008) పర్యాయములు జపించే వ్యక్తి త్రిజగద్వంద్యుడౌతాడు. అతడు అగ్నిసదృశ తేజస్వంతుడై బ్రహ్మేంద్రాది దేవతలకు వంద్యుడౌతాడు. అతనిని సర్వకాల సర్వావస్థల యందు వేదమాత గాయత్రి సంరక్షిస్తూ సర్వసంపత్సమృద్ధులను అనుగ్రహిస్తుంది. శాక్తసంప్రదాయంలో త్రిసంధ్యలయందును సూర్య దేవతాకమైన గాయత్రీ దేవతను 'ఐం పరబ్రహ్మణే సూర్యాయ ప్రాతస్సంధ్యాయై నమః' అని ప్రాతఃకాలంలో బ్రహ్మాణిగా, క్లీం రుద్రాయ సూర్యాయ మాధ్యాహ్నిక సంధ్యాయై నమః అని మధ్యాహ్నం రుద్రాణిగాను, సాయంసంధ్యలో సౌః విష్ణవే సూర్యాయ సాయం 31 'సుప్రజా' అనే మంత్రాన్ని కుడిచెవిలో జపించి, బ్రహ్మచర్యవ్రతమును పొందుచున్నావని అనుశాసించి, అతనిచే 'బ్రహ్మచర్య మాగామ్' బ్రహ్మచర్య వ్రతమును ప్రవేశించితిని - అని ప్రతిజ్ఞ చేయిస్తాడు. వ్రతమును ధరించిన వటువుచే యోగాది నవమంత్రములతోను 'చిత్తంచస్వాహా' మొదలైన 58 ఉపహోమాలను చేయిస్తాడు. 11. గాయత్ర్యుపదేశము : తరువాత ఆచార్యుడు సభకు నమస్కరించి 'గాయత్ర్యుపదేశస్య సుముహూర్తోస్త్వితి భవంతో బ్రువన్తు' అని పెద్దల అభ్యనుజ్ఞను పొంది కుమారునకు మారుగా స్వీకరించిన వటువునకు గాయత్రీ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. మనదేశాచారం ప్రకారం తండ్రి కుమారునకు గాయత్రిని ఉపదేశిస్తాడు. గాయత్రీ ప్రాశస్త్యము : 'నగాయత్ర్యాః పరం మంత్రమ్' గాయత్రిని మించిన మంత్రము లేదు. ఇది చతుర్వింశత్యక్షర 30 సంధ్యాయై నమఃఅని వైష్ణవిగాను, యీ తల్లిని అర్చిస్తారు. తరువాత పాలాశదండమును కుడిచేత పట్టించి ఉభయవ్రత మంత్రాలను చెప్పించి గోదానం చేయించి సూర్యదర్శనమును ఉపస్థానమంత్రపురస్సరముగా చేయించిన పిమ్మట.... 12. అగ్నికార్యము : ఈ అగ్నికార్యం విషయంలో అగ్నికార్యం వటుః కుర్యాత్ సంధ్యయోరుభయోరపి సాయమేవేత్యేకే - అంటే వటువు ఉపనయన దీక్ష స్వీకరించినది మొదలు సంధ్యా వందనము వలెనే ఉభయ సంధ్యలందు అగ్నికార్యం కూడా చేయాలి అని, సాయంకాలం చేస్తే సరిపోతుందని రెండు మతభేదాలున్నాయి. వీనిలో ఉభయ సంధ్యలందు విధిగా అగ్నికార్యం కూడా చెయ్యాలన్నదే పలువురి అభిప్రాయము. అనూచానంగా అందరూ అనుసరిస్తున్న శిష్టాచారం. కాబట్టి ఉభయ సంధ్యల యందును అగ్నికార్యం చేయాలి. దీనివల్ల సంపద, తేజస్సు, ఓజస్సు లభిస్తాయి. అగ్నికార్యం చేయడానికి 15-20 నిముషముల 32 కన్నా సమయం ఎక్కువ పట్టదు. ఈ విధానాన్ని మూడు రోజులపాటు త్రిరాత్రదీక్షగా ఉభయ సంధ్యల యందును విధిగా వటువు ఆచార్యుని వద్ద నేర్చుకోవాలి. మొదటిరోజు ప్రాతరగ్నికార్యం పూర్తయిన తరువాత గోత్రప్రవరలు చెప్పిస్తూ భిక్షాటనంలో శిక్షణ నియ్యాలి. దీనినే భిక్షావందనమంటారు. భిక్షాటనమునకు భిక్షావందనమనే పేరు. 'తతోగురుం మాతరం అన్యాన్ గురూంశ్చ నమసృత్య భిక్షాంయాచయేత్' అనే సూత్రము ప్రకారం వ్యవహారంలోనికి వచ్చిందని చెప్పవచ్చు. దీనిలో వటువునకు ఓం చతుస్సాగర పర్యన్తం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు... ఆరేయగోత్రః..... సూత్రీ.. శాఖాధ్యాయీ... నామా అహంభోః అభివాదయే అని ప్రవరను చెప్పిస్తూ మన దేశాచారం ప్రకారం ఆచార్యుడు తొలిభిక్షను తల్లిచేత వేయిస్తాడు. కారణం ముందుగా తల్లిని, మాతృదేవోభవ అని, తరువాత పితృదేవోభవ, ఆచార్యదేవోభవ ఇలా క్రమాన్ని శ్రుతిమాత నిర్దేశించింది. 33 కార్యములను వటువుచే సక్రమంగా చేయించాలి. మధ్యాహ్న సమయంలో సంధ్యావందనం మాత్రం చేయిస్తే సరిపోతుంది. ఈ విధంగా త్రిరాత్ర దీక్షను పూర్తిచేయాలి. తరువాత 4వ రోజు కార్యక్రమం... 14. పాలాశప్రయోగం లేదా మేధాజననం : పాలాశమంటే మోదుగ చెట్టు అని అర్థం. మోదుగచెట్టుమొదట చేసే సంస్కారం కాబట్టి, దీనికి పాలాశప్రయోగమని పేరు వచ్చింది. ఉపనయన సంస్కారవ్రత దీక్షగా మూడు రోజులు ఆమభిక్ష చేసి, నాలుగవ రోజున భిక్షాన్నమును సంపాదించి, ఆచార్యునితో పాటు గ్రామమునకు వెలుపల తూర్పున లేదా ఉత్తరమున నున్న మోదుగ చెట్టు మొదట ఈ పాలాశకర్మను చెయ్యాలని శాస్త్రం. ఈ విధంగా చేయడానికి అవకాశము లేకుంటే గృహమందే ప్రాచీముఖంగా గాని ఉత్తరముఖంగా గాని, ఒక మోదుగచెట్టు కొమ్మనుంచి, దానిమొదట ముందుగా సంకల్పం, గణపతిపూజ చేసి మూడుమండపాలలో 35 13. బ్రాహ్మణాశీర్వాదము : భిక్షావందనము తరువాత బ్రాహ్మణాశీర్వాదముతో ఉపనయనం పూర్తయినట్లే. బ్రాహ్మణులను యథాశక్తిగా సంతర్పణ, వస్త్రాలంకరణ దక్షిణలచే సంతృప్తి పరచినవారి ఆశీస్సులను పొందడం సంప్రదాయం. దీనినే సదస్యం అంటారు. దీనిని కొందరు భిక్షావందనమయిన వెంటనే చేస్తారు. కృష్ణాజిల్లాలో ఈ సంప్రదాయం కనిపిస్తుంది. గోదావరి జిల్లాలలో మధ్యాహ్నం 4గం. లకు వేదస్వస్తి, సదస్యము జరిపించే ఆచారము వ్యవహారంలో ఉంది. తరువాత సాయంకాలం సంధ్యావందనం మరియు అగ్నికార్యములతో ప్రథమదివస కార్యక్రమం పూర్తయినట్లే. ఉపనయనం ఇంతటితో అయిందనుకుంటే పొరపాటే. అగ్నికార్యం హోమాలు చేసిన ఈ అగ్నిహోత్రాన్ని త్రిరాత్రదీక్షానిష్ఠుడైన వటువు లేదా అతని సంబంధులు చల్లారిపోకుండా విధిగా మూడురోజులూ పరిరక్షించాలి. రెండవ మూడవ దినములలో ఆచార్యుడు ఉభయ సంధ్యల యందు సంధ్యావందన, అగ్ని 34 ప్రణవ, శ్రద్ధా, మేధాదేవతలనావాహన చేసి ప్రాణప్రతిష్ఠ గావించి ఆయా మంత్రాలతో వానికి షోడశోపచార పూజ చేసి అప్పములతో కూడిన శుభాన్నమును నివేదన చేసి, తరువాత అగ్నిని ప్రజ్వలింపచేసి, షట్పాత్రప్రయోగం చేసి పిమ్మట - యశ్ఛందసామిత్యాది మంత్రాలతో ఏకాదశ హోమములు వటువుచే చేయించాలి. తరువాత 'అనేన పాలాశహోమేన భగవాన్ సర్వాత్మకః శ్రీయజ్ఞేశ్వరః ప్రీణాతు. సర్వం శ్రీయజ్ఞేశ్వరార్పణమస్తు! అని హోమాదికమంతయు యజ్ఞేశ్వరార్పితముగా సమర్పించాలి. పిమ్మట (అపరేణాగ్నిం) అగ్నికావలివైపున వటువు మేఖలాజినదండములను మోదుగు చెట్టుపై నుంచి 'అన్యాని నూతన వస్త్రాణి ధారయేత్''ఇతరములైన నూతన వస్త్రములను మేఖలను ధరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆచార్యునితో పాటుగా ఇంటికి వచ్చి బ్రాహ్మణాశీర్వాదములను పొందవలెను. ఈ కార్యక్రమము వల్ల ప్రణవ, శ్రద్ధా, మేధాదేవతల మఱియు బ్రాహ్మణాశీర్వాద ఫలితముగా వటువునకు బ్రహ్మచర్య 36 వ్రతదీక్షాసామర్థ్యము, ఆయుష్షు, వర్చస్సు, బుద్ధి, ప్రజ్ఞ, వృద్ధి పొంది అతడు సర్వవిద్యాపారంగతుడై సద్యశమును పొందుతాడు. సంగ్రహంగా ఇదీ ఉపనయన సంస్కారం యొక్క పరిచయం. బ్రహ్మచారి పాటించవలసిన ధర్మములు బ్రహ్మచర్య దీక్షలో చాలా విధి నిషేధాలు స్మృతి గ్రంథాల్లో గోచరిస్తాయి. ప్రస్తుతకాలానుగుణంగా కొన్నింటినిలా ఆచరించడానికి ప్రయత్నిద్దాం. 1. బ్రాహ్మముహూర్తంలో లేచి సకాలంలో సంధ్యా వందనం అగ్నికార్యం చేయాలి. సూర్యోదయానికి సుమారు 10 ని॥ల ముందు సంధ్యావందనం ప్రారంభించాలి. సాయం సంధ్యను సూర్యాస్తమయానికి 10 ని॥లు ముందు ప్రారంభించాలి. అలా ప్రారంభిస్తే సూర్యోదయ సూర్యాస్తమయాలకు సరిగా అర్ఘ్యప్రదానం చెయ్యవచ్చు. 2. సాధ్యమైనంత వరకు ప్రాతఃసాయంసంధ్యల రెండింటియందు అగ్నికార్యం చేయాలి. చేస్తే 37 7. గీత, నృత్య, వాద్య, వినోదములయందు అత్యాసక్తిని పెంపొందించుకొనకుండా వానితో పరిమిత పరిచయము కలిగియుండుట శ్రేయస్కరము. 8. సజ్జనులతో మాత్రమే సహవాసము. సహపాఠము ఆచరించి మిగిలిన సమయమును జప, హోమ, అధ్యయనము లందు మాత్రమే గడపవలెను. 9. పగటినిద్ర మంచిదికాదు. ప్రతిదినము బ్రాహ్మ ముహూర్తంలో లేవాలి. రాత్రి తొలిఝాము పూర్తి కాగానే అనగా రాత్రి 9-10గం॥లోగా నిద్రించాలి. 10. తల్లిదండ్రులు, ఆచార్యులు, పెద్దలయెడ విధేయతను కలిగియుండవలెను. ఈ విధముగా ఉపనయన సంస్కార ప్రాశస్త్యాన్ని సంభావిస్తూ, తద్వారా లభించిన యజ్ఞోపవీత, గాయత్రీ జపానుష్ఠాన, అగ్నికార్యములను సంధ్యావందనమున కంగములుగా నిర్వర్తిస్తూ యీ మానవజన్మను దివ్యత్వ సాధన ద్వారా చరితార్థము చేసికొనుటకై ఉపనయన సంస్కారభాగ్యమును పొందిన వటువులు యథాశక్తిగా 39 తప్పకుండా మేధ, ప్రజ్ఞ, ఆయుష్షు అభివృద్ధి చెందుతాయి. 3. కనీసం ఉభయసంధ్యల యందు నూటయెనిమిది పర్యాయములు గాయత్రీ జపం చేయాలి. 4. అష్టోత్తర సహస్రం అంటే 1008 సార్లు జపం చేయడం చాలా మంచిది. ముప్పొద్దుల సహస్ర గాయత్రి చేసిన వ్యక్తి భూసురుడే అంటే దైవసమానుడే అవుతాడు. అతని సంకల్పానికి వికల్పము ఉండదు. ఇది ఎవ్వరైనా ఆచరించి అనుభవపూర్వకంగా గ్రహించవచ్చు. 5. హితకరమైన మధురములైన సాత్వికాహారములనే మితంగా భుజించాలి. నిషిద్ధములైన మద్య మాంసములను తినకూడదు. 6. స్త్రీలతో పరిచయములు, అతిగా భాషించుట నిషిద్ధము. తల్లి, సోదరి, ఇతరులైన ఆత్మీయులతో కూడా మితముగా భాషించుట, మితముగా చరించుట అలవరచుకొనవలెను. 38 ప్రయత్నించాలి. తల్లిదండ్రులు ఆచార్యులు పెద్దలు పిల్లలకు ఆ దిశగా తగిన మార్గదర్శనం చేయాలి. ఈ విధమైన పరస్పర సహకారంతో ఆబాలగోపాలము తరించి సమాజానికి సుఖశాంతులు సమకూర్చాలని అందరికీ వేదమాత గాయత్రి తగిన బుద్ధి ప్రచోదనమును చేస్తూ ఆయురారోగ్యైశ్వర్యముల ననుగ్రహించాలని ఆకాంక్షిద్దాం! శుభం భూయాత్ సంధ్యావందనము శ్లో॥ అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపి వా, యస్స్మరేత్పుణ్డరీకాక్షం స బాహ్యాభ్యన్తరశ్శుచిః పుణ్డరీకాక్షః పుణ్డరీకాక్షః పుణ్డరీకాక్షాయనమః ఆచమనము కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా అని ముమ్మారు ఆచమించాలి. 40 గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేన్దాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః అని కేశవనామాలను చెప్పుకోవాలి. భూతోచ్చాటనము ఉత్తిష్ఠన్తు భూతపిశాచాః యే తే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ॥ అని సంకల్పించి ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామము ఓం భూః, ఓం భువః, ఓగ్ం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ం సత్యమ్, ఓం తథ్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓ 41 మార్జన మంత్రము ఆపోహిష్ఠా మయోభువః తాన ఉర్జే దధాతన మహేరణాయ చక్షసే యోనశ్శివతమో రసః తస్యభాజయ తేహనః ఉశతీరివ మాతరః తస్మా అరంగమామవః యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథాచనః । ఈ మంత్రము చదువుచు అనామికతో నీరు శిరస్సు నందు జల్లుకొనవలయును. ప్రాతఃకాల సర్ధ్యావందనము చేయునపుడు చెప్పవలసినది. జలప్రాశన మంత్రము అంగుష్ఠతర్జనీయోగంతో చుళుకముద్ర పుడిసిలిపట్టి 10 మినుమగింజలు మునిగేలా నీరు తీసికుని సూర్యశ్చ మా మన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః, పాపేభ్యో రక్షన్తామ్, యద్రాత్ర్యాపాప మకాల్షమ్, మనసా వాచా హస్తాభ్యామ్ పద్భ్యా ముదరేణ శిశ్నా రాత్రి స్తదదవలుమ్పతు. యత్కిఞ్చ దురితం మయి, ఇద మహం మా మమృతయోనౌ, సూర్యే జ్యోతిషి జుహోమి స్వాహా ॥ 43 మాపోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్ ॥ అంటూ గురూపదిష్ట మార్గంలో కనీసమొక ప్రాణా యామాన్ని కుంభక పూరక రేచకపురస్సరంగా చేయాలి. సంకల్పము మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే కలియుగే, ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే, శ్రీశైలస్య పశ్చిమప్రదేశే గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహరసన్నిధౌ. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన... సంవత్సరే... అయనే... ఋతౌ... మాసే... పక్షే...తిధౌ.. శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ శ్రీమాన్.. గోత్రః..... అహం ప్రాతస్సన్హ్యాం/మాధ్యాహ్నికసన్హ్యాం/ సాయం సన్యాముపాసిష్యే. 42 ఈ పై మంత్రమును ఉచ్చరించి జలపానము చేయవలెను. ఇట్లే మాధ్యాహ్నిక కాలమందు చెప్పవలసిన జలప్రాశనమంత్రము ఆపః పునన్తుపృథివీం, పృథివీ పూతా పునాతు మామ్, పునన్తు బ్రహ్మణస్పతి, రబ్రహ్మ పూతా పునాతుమామ్ యదుచ్ఛిష్ట మభోజ్యం యద్వా దుశ్చరితం మమ సర్వం పునన్తు మామాపో సతాంచ ప్రతిగ్రహగ్గా స్వాహా ॥ సాయంకాలమందు చెప్పవలసిన జలప్రాశన మంత్రము అగ్నిశ్చ మా మన్యుపతయశ్చ మన్యు కృతేభ్యః, పాపేభ్యో రక్షన్తామ్, యదహ్నా పాపమకాల్షిమ్ మనసా వాచా హస్తాభ్యమ్ పద్భ్యా ముదరేణ శిశ్నా అహస్తదవలుమృతు యత్కిఞ్చ దురితం మయి ఇద మహం మా మమృత యోనౌ సత్యే జ్యోతిషి జుహోమి స్వాహా ॥ అని మరల ఆచమనము చేయవలెను 44 పునః మార్జనము దధిక్రావ్ అకారిషమ్, జిష్ణో రశ్వస్య వాజినః, సురభినో ముఖాకరత్రణ ఆయుగంషి తారిషత్ ఆపోహిష్ఠా మయోభువః, తాన ఊర్జే దధాతన, మహేరణాయ చక్షసే, యోవశ్శివతమోరసః, తస్య భాజయ తేహ నః, ఉశతీరివ మాతరః, తస్మా ఆరంగ మామ వః యస్యక్షయాయజిన్వథ, ఆపోజనయథా చ నః ॥ మరల మార్జనము ద్రుపదాదివ ముఞ్చతు, ద్రుపదాది వేన్మముచానః, స్విన్నస్స్నాత్వీ మలాదివ పూతం పవిత్రేణేవాజ్యమ్ ఆపశ్శున్దన్తు మైనసః ॥ ఆచమ్య ప్రాణానాయమ్య అర్ఘ్య ప్రదానము పూర్వోక్షైవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ ప్రాతస్సన్ద్యార్ఘ్యప్రదానం / మాధ్యాహ్నిక సన్యార్ఘ్య ప్రదానం/ సాయంసన్ద్యార్ధ్య ప్రదానం కరిష్యే. 45 ॥ తర్పయామి, చిత్రం తర్పయామి, చిత్రగుప్తం తర్పయామి, శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని నవగ్రహములకు సన్ఘ్యం తర్పయామి గాయత్రీం తర్పయామి బ్రాహ్మీం తర్పయామి నిమృజీం తర్పయామి ॥ అని సంధ్యా దేవతలకు తర్పణములను విడిచిపెట్టాలి. మాధ్యాహ్నిక అర్ఘ్య ప్రదాన మంత్రము హగ్ంస శ్శుచిష ద్వసు రన్తరిక్షసద్ధోతా వేదిషదతిధిర్ధురోణ సత్ నృప దృతసద్వ్యోమస దబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్ II మాధ్యాహ్నిక తర్పణము సన్యాం తర్పయామి సావిత్రీం తర్పయామి రౌద్రీం తర్పయామి నిమృజీం తర్పయామి. సాయంకాల తర్పణము సన్యాం తర్పయామి సరస్వతీం తర్పయామి వైష్ణవీం తర్పయామి నిమృజీం తర్పయామి. అని మరల ఆచమనము చేయవలెను. 47 ప్రాతఃకాల అర్ఘ్యప్రదాన మంత్రము ఓం భూర్భువస్సువః ఓం తథ్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ॥ అని చేతితో నీటిని గ్రహించి పై మంత్రము నభిమంత్రించి తర్జని వ్రేలు కలియకుండా నీటినెత్తి గోశృంగ పరిమాణముగా 3 మారులు విడువవలయును. ఉద్యన్తమస్తంయన్త మాదిత్య మభిథ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాస్థ్సకలం భద్రమశ్నుతే సా వాదిత్యో బ్రహ్మేతి, బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి, య ఏవం వేద॥ అసావాదిత్యో బ్రహ్మా అనిచేతిలో నీళ్లు తీసుకుని తనచుట్టూ ప్రదక్షిణంగా ఆ నీటిని విడిచిపెట్టాలి. పిమ్మట ఆచమనము చేసి ప్రాతః సంస్ధ్యాతర్పణము చేయవలెను. మరల ఆచమనము చేయవలెను. తరువాత ఆదిత్యం తర్పయామి, సోమం తర్పయామి, అంగారకం తర్పయామి, బుధం తర్పయామి, బృహస్పతిం తర్పయామి, శుక్రం తర్పయామి, శని తర్పయామి, రాహుం తర్పయామి, కేతుం తర్పయామి, యమం 46 బ్రహ్మశక్తి ప్రార్థన మంత్రము ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మసమ్మితం గాయత్రీం ఛన్దసాం మాతేదం బ్రహ్మజుషస్వ మే య దహ్నాత్కురుతే పాపం తదహ్నా తతిముచ్యతే యద్రాత్రియాత్కురుతే పాపం తద్రాత్రియా త్పతిముచ్యతే సర్వవర్లే మహాదేవి సన్హ్యావిధ్యే సరస్వతి ॥ ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామనామాసి విశ్వమసి విశ్వాయుస్సర్వమసి సర్వాయు రభిభూరోం గాయత్రీమావాహయామి సావిత్రీ మావాహయామి సరస్వతీమావాహయామి ఛన్దరీ నావాహయామి శ్రియ మావాహయామి గాయత్రియా గాయత్రీచ్ఛన్గో విశ్వామిత్ర ఋషి స్సవితా దేవతాగ్ని ర్ముఖం బ్రహ్మా శిరో విష్ణుర్ హృదయగ్ం రుద్రశ్శిఖా పృథివీయోనిః ప్రాణాపానవ్యానోదానసమానా సప్రాణా శ్వేతవర్ణా సాజ్ఞ్యాయనసగోత్రా గాయత్రీ చతుర్విగ్ం శత్యక్షరా త్రిపదా షట్కుక్షిః పఞ్చశీర్ షోపనయనే వినియోగః 48 ఆచమ్య ప్రాణానాయమ్య గాయత్రీ జపసంకల్పః మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం సస్ధ్యాఙ్గ గాయత్రీ మహామస్త్రజపం కరిష్యే. కరన్యాసః ఓం తత్సవితుః - బ్రహ్మాత్మనే అఙ్గుష్ఠాభ్యాం నమః వరేణ్యం - విష్ణ్వాత్మనే తర్జనీభ్యాం నమః భర్గోదేవస్య - రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః ధీమహి - సత్యాత్మనే అనామికాభ్యాం నమః ధియో యోనః - జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః ప్రచోదయాత్ - సర్వాత్మనే కరతలకరపృష్ఠాభ్యాం నమః అఙ్గన్యాసః ఓం తత్సవితుః - బ్రహ్మాత్మనే హృదయాయ నమః వరేణ్యమ్ - విష్ణ్వాత్మనే శిరసే స్వాహా భర్గోదేవస్య - రుద్రాత్మనే శిఖాయై వౌషట్ 49 యమపాశం చ గ్రధితం సమ్ముఖోన్ముఖమ్ ప్రలమ్భం ముష్టికం చైవ మత్స్యః కూర్మోవరాహకమ్. సింహాక్రాన్తం మహాక్రాంతం ముద్గరం పల్లవం తథా చతుర్వింశతి ముద్రావై గాయం సుప్రతిష్ఠితాః ॥ II (ఈ ముద్రలను వేయు పద్ధతి గురుముఖమున తెలిసికొన వలయును) 3 శ్లో॥ గురుర్రహ్మా గురుర్విష్ణు ర్గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః గాయత్రీ మంత్రజపము ఓం భూర్భువ స్సువః ఓం తథ్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ॥ ( అని 108 పర్యాయములు తక్కువ కాకుండా యధాశక్తిని గాయత్రీ మంత్రజపమును చేయవలయును. జపము ముగిసిన పిమ్మట జలమును గ్రహించి తత్స్ బ్రహ్మార్పణ మస్తు అని విడువవలయును). 51 ధీమహి - సత్యాత్మనే కవచాయ హుమ్ ధియో యోనః - జ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ ప్రచోదయాత్ - సర్వాత్మనే అస్త్రాయ ఫట్ భూర్భువస్సువరోమితి దిగ్బన్ధః ధ్యానమ్ శ్లో॥ ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్చాయైర్ముఖైస్క్రీక్షణ ర్యుక్తామిన్దునిబద్ధరత్న మకుటాం తత్వార్ధవర్ణాత్మికామ్ గాయత్రీం వరదాభయాఙ్కుశకశాశ్శుభ్రం కపాలం గదాం శబ్ధం చక్రమధారవిన్దయుగళంహ సైర్వహస్తీంభజే శ్లో॥ యో దేవస్సవితాస్మాకం ధియోధర్మాదిగోచరాః ప్రేరయేత్తస్య య దర్భర్గస్తద్వరేణ్య ముపాస్మహే అని ధ్యానించి.. ముద్రా ప్రదర్శనము సుముఖం సంపుటం చైవ వితతం విస్తృతం తథా ద్విముఖం త్రిముఖం చైవ చతుః పంచముఖం తథా షణ్ముఖోధోముఖం చైవ వ్యాపకాజ్ఞలికం తథా శకటం 50 ఆచమనము చేసికొని ప్రాతఃసూర్యోపస్థాన మంత్రము మిత్రస్య చర్షణీధృత, శ్రవో దేవస్య సానసిమ్ సత్యం చిత్రశ్రవస్తమమ్, మిత్రో జనాన్ యాతయతి ప్రజాన న్మిత్రోదాధార, పృథివీ ముతద్యామ్ మిత్రః కృష్ఠీ రనిమిషాభిచష్టే సత్యాయ హవ్యం మృతవద్విధేమ ప్రసమిత్ర మర్తో అస్తు ప్రయస్వాన్ యస్త ఆదిత్యః శిక్షతి వ్రతేన, న హన్యతే న జీయతే త్వోతోనైన మగ్ హో అశ్నోత్యన్తితో న దూరాత్ II మాధ్యాహ్నిక సూర్యోపస్థానము ఆ సత్యేన రజసా వర్తమానో నివేశయ న్నమృతం మర్త్యం చ, హిరణ్యయేన సవితా రథే నా దేవో యాతి భువనా విపశ్యన్న్ ఉద్వయం తమసస్పరిపశ్యన్తో జ్యోతిరుత్తమమ్ దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిర్తుమమ్ । । ఉదత్యం జాత వేదసం దేవం వహన్తి కేతవః, దృశే విశ్వాయ సూర్యమ్, చిత్రం దేవానా ముదగాదనీకం, చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః, ఆప్రాద్యావా పృథివీ అన్తరిక్ష ం, సూర్య 52 ఆత్మా జగతస్తస్థుషశ్చ త చ్చక్షుర్దేవహితం పురస్తాచ్ఛుక్ర ముచ్చరత్, పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం, నన్దామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం, భవామ శరదశ్శతగ్ం, శృణవామ శరదశ్శతం ప్రబ్రవామ శరదశ్శత మజీతా స్స్యామ శరదశ్శతం జ్యోక్చ సూర్యం దృశే య ఉదగాన్మహతోర్ణవా ద్విభ్రాజమాన స్సరిరస్య మధ్యాత్సమా వృషభోలోహితాక్షః సూర్యో విపశ్చిన్మనసా పునాతు ॥ సాయంకాల సూర్యోపస్థాన మంత్రము ఇమం మే వరుణశ్రుధీ, హవమద్యా చ మృడయ, త్వా మవస్యురాచకే, తత్త్వాయామి బ్రహ్మణా వన్దమానస్త దాశాస్తే యజమానో హవిర్భిః, అహేడమానో వరుణేహ బోధ్యురుశగ్ం సమాన ఆయుః ప్రమోషీః ॥ యచ్చిద్ధి తే, విశో యథా, ప్రదేవ వరుణ వ్రతమ్, మినీ మసిద్యవిద్యవి, యత్కిం చేదం, వరుణ దైవ్యే జనేభిద్రోహం మనుష్యా శ్చరామసి, అచిత్తీ యత్తవ ధర్మాయుయోపిమ మానస్తస్మా దేనసో దేవరీరిషః కితవాసో యద్రి రిపుర్నదీవి 53 యమునయో ర్మునిభ్యశ్చ నమో నమో గఙ్గ యమునయో ర్మునిభ్యశ్చ నమః సన్యాయై నమః సావిత్ర్యై నమః గాయత్ర్యై నమః సరస్వత్యై నమః సర్వాభ్యో దేవతాభ్యో నమః దేవేభ్యో నమః ఋషిభ్యో నమః మునిభ్యో నమః గురుభ్యో నమః పితృభ్యో నమః కామోకార్షి ర్నమోనమః మన్యురకార్షి ర్నమో నమః పృథి వ్యాపస్తేజో వాయురాకాశాత్ ఓం నమో భగవతే వాసుదేవాయ యాగ్ం సదా సర్వభూతానిచరాణి స్థావరాణి చరాణిచ సాయం ప్రాతర్నమస్యన్తి సా మా సర్థ్యా అభిరక్షతు ॥ ఈశ్వర ధ్యానము శ్లో॥ శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే । । శివ్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయగ్ం శివః 3 శ్లో॥ యథా శివమయో విష్ణు రేవం విష్ణుమయ శ్శివః యథాన్తరం నపశ్యామి తథామే స్వస్తి రాయుషి ॥ 55 యద్వాఘా సత్యముత యన్న విద్మ స్సర్వాతావిష్య శిథిరేవ దేవాః థా తేస్యామ వరుణ ప్రియాసః ॥ దిగ్దేవతాది నమస్కారము ఓం నమః ప్రాచ్యైదిశే యాశ్చదేవతా ఏతస్యాం ప్రతివసన్యేతాభ్యశ్చ నమో నమో దక్షిణాయైదిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసన్యేత్యాభ్యశ్చ నమో నమః॥ ప్రతీచ్యై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసన్యేతాభ్యశ్చ నమో నమ ఉదీచ్యై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసన్యేతాభ్యశ్చ నమో నమః ఊర్ధ్వాయై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసన్యే తాభ్యశ్చ నమో నమో ధరాయై దిశేయాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసన్యేతాభ్యశ్చ నమోనమో..వాన్తరాయై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసన్యేతాభ్యశ్చ నమః ముని నమస్కారము నమో గజ్గా యమునయోర్మధ్యే యే వసన్తి తే మే ప్రసన్నాత్మాన శ్చిరజ్జీవితం వర్ధయన్తి నమో గఙ్గ 54 శ్లో॥ నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ । జగద్ధితాయ కృష్ణాయ గోవిన్దాయ నమో నమః ॥ ధ్యానపూర్వక గాయత్రీ ప్రస్థానము ఉత్తమేశిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ఖని బ్రాహ్మణేభ్యో భ్యనుజ్ఞాతా గచ్ఛ దేవి యథాసుఖమ్. స్తుతోమయా వరదా వేదమాతా ప్రచోదయన్తి పవనే ద్విజాతా ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రయాతుం బ్రహ్మలోకమ్. భగవన్నమస్కారము శ్లో॥ నమోస్త్వనన్తాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే । సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీయుగధారిణే నమః 56 వాసుదేవ ప్రార్థన శ్లో॥ 3 శ్లో॥ ఆకాశాత్పతితం తోయం యథాగచ్ఛతి సాగరమ్ సర్వదేవననుస్కారః కేశవం ప్రతిగచ్ఛతి । సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలమ్ తత్ఫలం పురుషమాప్నోతి స్తుత్వా దేవం జనార్దనమ్ శ్లో॥ వాసనాద్వాసుదేవస్య వాసితం తే జగత్తయమ్ । సర్వభూతనివాసోసి వాసుదేవ నమోస్తుతే ॥ చతుస్సాగర పర్యన్తం గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు । ...ఆరేయ... ప్రవరాన్విత... స గోత్రః ఆపస్తంబ సూత్రః యజుశ్శాఖాధ్యాయీ... శర్మాహంభో అభివాదయే॥ శ్లో॥ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ । కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ॥ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు ఆ బ్రహ్మలోకా దాశేషా దాలోకాలోక పర్వతాత్ । యేసన్తి బ్రాహ్మణా దేవాస్తేభ్యో నిత్యం నమోనమః సంస్ధ్యావందనం సమాప్తం 57 జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్ ॥ ॥ మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే, శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరో దక్షిణదిగ్భాగే, శ్రీశైలస్య పశ్చిమప్రదేశ్ గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శోభన గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ హరిహరసన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన... సంవత్సరే... అయనే... ఋతౌ... మాసే... పక్షే...తిధౌ.. శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ, శ్రీమాన్.... గోత్రః... నామధేయః... శ్రీమతః గోత్రస్య... నామధేయస్య మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆయుష్యాభివృద్ధ్యర్థం మమశ్రాత స్మార్త నిత్యకర్మానుష్ఠాన యోగ్యతాఫల సిద్ధ్యర్థం నూతన యజ్ఞోపవీతధారణం కరిష్యే II 59 యజ్ఞోపవీతధారణమ్ ఆచమ్య, కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా, గోవిందాయ నమః, విష్ణవే నమఃమధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః, ఉపేన్దాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతేభూమి భారకాః । ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే॥ ఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జనః ఓం తపః । ఓగ్ం సత్యమ్ ఓం తత్సవితుర్వరేణ్యమ్ । భర్గోదేవస్య ధీమహి । ధియోయోనః ప్రచోదయాత్ । ఓమాపో 58 (యజ్ఞోపవీతములు ఐదింటిని కుంకుమచే అలంకరించి అధిష్ఠాన దేవతను గాయత్రిని ధ్యానించి యజ్ఞోపవీత మంత్రమును చెప్పి యీ క్రిందివిధముగా ధరించవలెను.) యజ్ఞోపవీతేత్యస్య మంత్రస్య పరమేష్ఠీ పరబ్రహ్మర్షిః । పరమాత్మా దేవతా। దేవీ గాయత్రీచ్ఛందః యజ్ఞోపవీత ధారణే వినియోగః ॥ ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ । ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ॥ అని ఒక యజ్ఞోపవీతమును తీసుకుని కుడిబాహువునెత్తి తద్వారా సవ్యబాహువుపైన అనగా ఎడమబాహువునందు యజ్ఞోపవీతము ధరించ వలయును. మంత్రపఠన సమయములో కుడిబాహువు నెత్తి, శరీరము నంటకుండా యజ్ఞోపవీతమును పట్టియుంచి మంత్రాంతమందు ధరించవలయును. మరల ఆచమనము చేసి.... 60 ద్వితీయోపవీత ధారణమ్ మమ నిత్యకర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే ॥ పూర్వవత్ ద్వితీయ యజ్ఞోపవీతం ధృత్వాచమ్య ॥ (అని సంకల్పించి పై మంత్రము నుచ్చరింపుచు రెండవ యజ్ఞోపవీతము పైన చెప్పిన విధముగా ధరించి మరల ఆచమనము చేసి) తృతీయోపవీత ధారణమ్ ఉత్తరీయార్ధం తృతీయ యజ్ఞోపవీదధారణం కరిష్యే ఇతి సంకల్ప్య, పూర్వవద్యజ్ఞోపవీతం ధృత్వాచమ్య అని సంకల్పించి పై మంత్రముచే మూడవ యజ్ఞోపవీతమును ధరించవలయును. చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణమ్ పై విధముగా ఆచమనము చేసి చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణమ్ కరిష్యే । అని సంకల్పము చేసి పై మంత్రముచే 4,5 యజ్ఞోపవీతములను ఒకదాని తర్వాత మరియొకటి ధరించవలయును. 61 ముందుమాట ఉపనయన వివాహాది కార్యక్రమాలు ఎంతో వైభవంగా చేసుకుంటున్నాం. దానికి ఎంతో ధనం ఖర్చు చేస్తున్నాం. కానీ వాని అర్థం పరమార్థం చాలామంది తల్లిదండ్రులకు గాని, వారి పిల్లలకు గాని తెలియడం లేదు. అవి ఏవో సదాచారాల తంతుగా సాగిపోతున్నాయి. ఉపనయనం పెళ్లికి లైసెన్సు, వివాహం సంతానం కనడానికి లైసెన్సుగా మాత్రమే చెలామణి అవుతున్నాయి. మన యీ సంస్కారాల ప్రాముఖ్యం తెలుసుకుంటే పిల్లలు, సమాజం బాగుపడుతుంది. ఈ దిశగా వాటి పరమార్థాన్ని వివరిస్తే బాగుంటుందని చాలామంది మిత్రులు సూచించేరు. ప్రచారానికి అనువుగా యించుమించు శుభలేఖ ధరకు పంచేలా చౌకగా ముద్రించి యివ్వడానికి మా సుతనిర్విశేషుడు చి॥ పద్మనాభం ముందుకు వచ్చేడు. ఇలా ఈ పుస్తకం ఆవిర్భవించింది. ఈ జ్ఞానయజ్ఞంలో మాకు సహకరించిన అమలాపురం వాస్తవ్యులు శ్రీ వడ్లమాని కృష్ణమూర్తిగారి కుటుంబ సభ్యులకు మా కృతజ్ఞతలను తెలియచేస్తున్నాం. రచయిత మరియు ప్రకాశకులు, పద్మనాభ ఆఫ్సెట్ ప్రింటర్స్, కాకినాడ జీర్ణోపవీత విసర్జనమ్ తిరిగి ఆచమనము చేసి ఈ క్రింది శ్లోకమును చదువుచు యజ్ఞోపవీతము విసర్జనము చేసి రెండుసార్లు ఆచమనము చేయవలయును. శ్లో॥ ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణం కశ్మలదూషితం । విసృజామి యశో బ్రహ్మవర్చో దీర్ఘాయురస్తుమే ॥ వేదావేద్యం పరబ్రహ్మతత్త్వం జీర్ణోపవీతం విసృజస్త్యమోజః అని చెప్పి భుజముల నుండి జీర్ణోపవీతమును క్రిందుగా జార్చి అధోముఖంగా తీసివేయాలి. శుభం భవతు 62 ఉపనయనం ఎందుకు? శ్రీపాదుక ఆచార్య కొల్లూరు అవతారశర్మ R సర్వహక్కులు గ్రంథకర్తవి అమలాపురం వాస్తవ్యులు శ్రీ వడ్లమాని కృష్ణమూర్తిగారు తమ మనుమలు చి॥ సుబ్రహ్మణ్య శ్రీరామకృష్ణ ప్రమోద్ మరియు చి॥ వంశీకృష్ణ యశస్విల 'ఉపనయన మహోత్సవ' సందర్భంగా సత్కార పురస్సరముగా సమర్పించు అమూల్యమైన చిఱుకానుక! ఉపనయన వేదిక : 4-2-71, భూపయ్యఅగ్రహారం, అమలాపురం ది.6-6-2010 ఉ॥ గం.8-46ని॥లు ముహూర్తము : వికృతి - నిజవైశాఖ బహుళ నవమి ఆదివారం ఇందులో ఉపనయనం ఎందుకు చెయ్యాలి? ఎపుడు చెయ్యాలి? ఎన్నిరోజులు చెయ్యాలి? ఎలా చేయాలి? చేయడం వల్ల మనకు ఒరిగేదేమిటి? లేకుంటే పోయేదేమిటి? యజ్ఞోపవీతం ఎందుకు ధరించాలి? గాయత్రీ మంత్రప్రాశస్త్యం సంధ్యావందనం యజ్ఞోపవీతధారణ విధి ఇలా.... యెన్నెన్నో విషయాలు సరళమైన భాషలో సప్రమాణంగా వివరించే ప్రయత్నం జరిగింది. గమనిక : అతితక్కువ ధరలో లోపలి టైటిలేపేజీలో మీ శుభలేఖాంశములతో ఈ పుస్తకాన్ని బహూకరించదలచినవారు ఈ క్రింది చిరునామాను సంప్రదించండి శ్రీపాదుక ఆచార్య కొల్లూరు అవతారశర్మ 9-7-48, శ్రీ శంకరకృప, స్వర్ణసౌధ అపార్ట్మెంట్స్ గాంధీనగర్, కాకినాడ. ఫోన్ : 0884-2346306 సెల్ : 9440493951